Basara Triple IT Minister KTR today: నేడు ఆర్జీయూకేటీలో జరిగే 5వ స్నాతకోత్సవానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరవుతారని ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.వి. వెంకటరమణ అన్నారు. స్నాతకోత్సవ వేడుకల్లో 2013 నుండి 2016 వరకు సుమారు 576 మంది పూర్వ విద్యార్థులు సర్టిఫికేట్‌లను అందుకుంటారు. స్నాతకోత్సవంలో పూర్వ విద్యార్థులకు 36 బంగారు పతకాలు, 2 డోనర్ పతకాలను మంత్రులు ప్రదానం చేస్తారు.
ఈ వేడుకకు టీసీఎస్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్న ప్రత్యేక అతిథిగా హాజరవుతారని వివరించారు. ఆర్జీయూకేటీ విద్యార్థులకు 12వ తేదీ నుంచి 2200 ల్యాప్‌టాప్‌లు, 100 డెస్క్‌టాప్‌లు, యూనిఫారాలు, షూలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కొన్నింటిని మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో RGUKTని పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఆడిటోరియంలో కొత్త కుర్చీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 11:45 గంటలకు పూర్తవుతుందని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్ కుమార్, వినరోద్, పావని, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read also: Dr Vaishali Kidnap Case: ఎగ్జామ్స్ సెంటర్ కు కిడ్నాప్ కు గురైన వైశాలి.. అక్కడ భారీ భద్రత
ఈ ఏడాది సెప్టెంబర్ 26న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. జూన్‌లో ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ ఇక్కడికి వస్తే తప్పకుండా కేటీఆర్ ను తీసుకువస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు..ఆ హామీ మేరకు కేటీఆర్ తో పాటు సబితా ఇంద్రారెడ్డి ఆర్ టీయూకేటీకి వెళ్లారు. మళ్లీ ముగ్గురు మంత్రులు ట్రిపుల్ ఐటీకి వెళ్లడం రసాభాసగా మారింది. అయితే మంత్రి కేటీఆర్‌తో విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరిస్తారా? లేక కేటీఆర్ తో ఆనందంగా గడుపుతున్నారా? అనే అంశంపై సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.
Bihar court: సహారా అధినేత సుబ్రతా రాయ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ