Bandisanjay son Bhagiratha to High Court over university suspension: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథపై వివాదం మరింత వేడెక్కింది. తోటి విద్యార్థులను దూషించి కొడుతున్న రెండు వీడియోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది. వరుస వివాదాలు, కేసుల కారణంగా బండి సంజయ్ కుమారుడిని మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో బండి సంజయ్ కొడుకు కావడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో.. బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ ఇవాళ హై కోర్టు ను ఆశ్రయించారు. జనవరి 20 న భగీరధ్ ను మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని కోర్ట్ కు భగీరధ్ తెలిపాడు. ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్ట్ ను భగీరధ్ కోరాడు. అయితే.. పిటిషన్ ను విచారించిన హై కోర్ట్.. భగీరధ్ సస్పెన్షన్ పై హై కోర్టు స్టే విధించింది. పరీక్షకు రాసేందుకు అనుమతి ఇవ్వాలని మహేంద్ర యూనివర్సిటీ కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read also: Robot Man Of India: ‘రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా’.. పీఎస్‌వీ కిషన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
మార్చ్ 9 న హై కోర్ట్ ఉత్తర్వులు జారీచేసింది. హై కోర్ట్ అదేశలతో బండి భగీరద్ పరీక్షలు రాశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగీరధ్ ను క్లాస్ లోకి అనుమతించాలని యూనివర్సిటీ కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు నేతల మధ్య ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మరో వీడియో లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. తోటి విద్యార్థి అని కనికరం లేకుండా కాళ్లతో విచక్షణారహితంగా బాధిత విద్యార్థిపై కొట్టడం విద్యార్థుపట్ల ఇదే నా గౌరవం అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఎంత తప్పుచేస్తే మాత్రం కాళ్లతో కొట్టాలా? అంటూ ప్రశ్నించారు. అయితే ఆ వీడియోలో దాడికి గురైన యువకుడి వీడియోను బీజేపీ మద్దతుదారులు వైరల్ చేశారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కొట్టిన స్టూడెంట్ తానే ఓ అమ్మాయిని ఏడిపించడంతో అది తెలసిన భగీరత్ తనని కొట్టాడని ఆ యువకుడు చెప్పుకున్నాడు. భగీరథ్ స్టూడెంట్స్ పై దాడిచేసిన రెండు వీడియోలతో అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Kakani Govardhan Reddy: వాళ్లు డబ్బులు తీసుకున్నట్టు సాక్ష్యాధారాలున్నాయి.. పార్టీ ప్రక్షాళన చేస్తాం