Bandi Sanjay: ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందంటే వల్లభాయి పటేల్ కారణమన్నారు ఎంపీ బండి సంజయ్. ఉక్కు మనిషి దివంగత సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశానికి సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందంటే వల్లభాయి పటేల్ కారణమన్నారు. నిజాం పాలనలో నలిగిపోతున్న తెలంగాణను పాకిస్తాన్ లో విలీనం చేయకుండా అడ్డుకుని తెలంగాణకు విముక్తి కల్పించిన మహానేత సర్దార్ పటేల్ అని కొనియాడారు.
Read also: Thugs: రా యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ మ్యూజిక్ పార్టనర్‌గా సోనీ మ్యూజిక్
భారత జాతి సమైక్యత కోసం అహర్నిశలు క్రుషి చేసిన వల్లభాయి పటేల్ జయంతి రోజును జాతీయ ఐక్యతా దినంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించిన తేజోమూర్తి, దేశంలో 530కి పైగా ఉన్న సంస్థానాలను విలీనం చేసిన ఐక్యతామూర్తి, భారత తొలి ఉపప్రధానమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పించారు.
ప్రజలందరికీ జాతీయ ఐక్యతా దినోత్సవ శుభాకాంక్షలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, మాజీమంత్రి బాబూమోహన్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జెనవాడె సంగప్ప, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.
Cable Bridge Collapse: ఆ బాధ వర్ణనాతీతం.. వంతెన ఘటనపై మోడీ ఆవేదన