Bandi Sanjay : కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు, యూరియా సరఫరా సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై బండి సంజయ్ కడుపుమంట వ్యాఖ్యలు చేసి సర్కారుపై తీవ్రస్థాయిలో దాడి చేశారు.
కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందన
కేటీఆర్ తనపై పరువు నష్టం కేసు వేసిన విషయాన్ని ప్రస్తావించిన బండి సంజయ్, ఇది బెదిరింపు ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు. “తొమ్మిది సార్లు జైలు వెళ్లాను, వందకు పైగా కేసులు ఎదుర్కొన్నాను. ఇకనైనా భయపడతానా? నేను రాజకీయంగా ఎదుర్కొంటాను కానీ బెదిరించేందుకు ఇజ్జత్ దావాలు వేయను” అని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో దేవాలయంలో ప్రమాణం చేయమని విసిరిన సవాల్‌ను కేటీఆర్ ఎందుకు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Honeytrap: హనీ ట్రాప్‌లో పడ్డ యోగా గురువు.. కోట్లలో డబ్బు డిమాండ్ చేసిన ముఠా
యూరియా సరఫరా లోపాలు
రైతుల సమస్యలపై కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినప్పటికీ, కేవలం 9 లక్షల టన్నులు మాత్రమే రైతులకు పంపిణీ చేశారని, మిగిలిన 3 లక్షల టన్నులు బ్లాక్ మార్కెట్‌లో మాయమయ్యాయని ఆరోపించారు. “రైతులు చెప్పులు, పాస్‌బుక్స్ లైన్లో పెడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గన్‌మెన్లు యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. రైతుల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. RFCL సమస్య కారణంగా కొంత ఇబ్బంది ఉన్నా, దానిని కేంద్రం పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం
ఫీజు రీయింబర్స్మెంట్‌పై కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “15 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. 8 నుంచి 10 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. ఒక మంత్రి మాట ఇస్తే దాన్ని అమలు చేయాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు” అని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పంజాబ్ వెళ్లి చెల్లని చెక్కులు ఇచ్చారని గుర్తు చేశారు.
BCCI: ఏం చేసుకుంటారో చేసుకోండి.. హ్యాండ్‌షేక్ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి రియాక్షన్..