Bandi Sanjay : కరీంనగర్‌లో ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రూపాయి నాణేనికి రెండు ముఖాల్లా ఉన్నాయి. కేసీఆర్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మోదీ ప్రభుత్వ విధానం క్లియర్ – అవినీతిని తహతహలాడిపోవడం. ఊసరవెల్లిలా స్టాండ్ మారించే పార్టీ కాదు బీజేపీ’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bribe: లంచం తీసుకుని బుక్కయ్యారు.. డబ్బు ఆశతో సస్పెండ్ అయిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతితో నిండి ఉందని, రూ. 38 వేల కోట్ల ప్రాజెక్టును రూ. 1.2 లక్షల కోట్లకు పెంచడం ద్వారా కేసీఆర్ భారీ మోసం చేశారని పేర్కొన్నారు. దీనివల్ల అధికారులు, రాజకీయ నాయకులు వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదన్నారు. ఇకపోతే, కేసీఆర్ తనను తాను ఇంజినీర్, డాక్టర్ అంటూ ప్రాజెక్టును సమర్థించుకున్నా, విచారణకు వచ్చినప్పుడు కేబినెట్‌లో చర్చించి తీసుకున్న నిర్ణయం అని తప్పించుకోవడం చూస్తే బతకడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
‘‘రాహుల్ గాంధీ గతంలో కాళేశ్వరం పై సీబీఐ విచారణ డిమాండ్ చేశారు. ఇప్పుడు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు అర్థం చేసుకుని, బీజేపీకి అధికారం అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు’’ అని బండి సంజయ్ అన్నారు.
Anaswara : స్పీడు మీదున్న హీరోయిన్.. ఏకంగా 5 సినిమాలు రిలీజ్
