తెలంగాణలో వడ్ల కొనుగోలు, కాంటాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి బహిరంగలేఖ రాశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ తెలంగాణ శాఖ చేసిన అనేక ఉద్యమాలకు తలవొగ్గే మీరు వడ్లు కొనడానికి ముందుకు వచ్చారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతీ వడ్ల గింజ కొంటామని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం మీరు ఆర్భాటంగా ప్రకటించి 15 రోజులు కావస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే మీ ప్రకటన కేవలం ఉత్తర కుమారుని ప్రగల్భాలేనని…