తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్, పాదయాత్రలో అరెస్ట్ చేయడంపై అమిత్ సా ఆరాతీసారు. ఇవాళ బండి సంజయ్‌ను జనగాంలో అరెస్ట్ చేసి కరీంనగర్ లో ఆయన ఇంటికి తరలించిన పోలీసులు. ఈనేపథ్యంలో.. బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతుర్ని సస్పెండ్ చేయాలని డామాండ్ చేశారు. ఎక్కడ పాదయాత్ర ఆపారో, అక్కడి నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తా అని పేర్కొన్నారు. కూతురుకి ఓ న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా ? అంటూ ప్రశ్నించారు.21 రోజులుగా యాత్రపై లేని సమస్య ఇవాల ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. ఇవాళే నా యాత్రను అడ్డుకోవడానికి కారణం ఏంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాదయాత్రపై దాడి చేస్తే ప్రజలు బడిత పూజ చేస్తారని తెలిపారు. తన కూతురుని కాపాడుకునేందుకు నా యాత్రను కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు.
తప్పుచేస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడ ఆమాటలు ఏమయ్యాయని అన్నారు. దేవరుప్పల, అలంపూర్ లో యాత్రను అడ్డుకుంటే స్థానిక యువత తిరగబడ్డ సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. దేవురుప్పలలో మహిళలని చూడకుండా టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి దాడి చేసి గాయపర్చారన్నారు. అయినా తెగించి మహిళలు టీఆర్ఎస్ గూండాల దాడిని తిప్పికొట్టారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని దేశమంతా నివ్వెరపోతోందని బండి తెలిపారు. యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నా మొద్దు నిద్రలో సీఎం వున్నారని అన్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అంటూ తీవ్రంగా విమర్శించారు. ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఇచ్చినా జనం నుండి స్పందన లేదని తెలిపారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు వింటే తప్పా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తప్పా? అంటూ ప్రశ్నించారు బండి సంజయ్.
నీ కూతురు లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందిగా.. ఇప్పుడు పంజాబ్ తెలంగాణలో కూడా బయటకు వస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నాయకులు నిరసన తెలిపితే ఇష్టం వచ్చినట్లు కొట్టి నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్యకర్తలను రాక్షసంగా కొట్టారని, ఇష్టారీతిగా వ్యవహరించారని బండి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. లిక్కర్ స్కామ్ పై చర్చ జరుగుతోందని కూతురును కాపాడుకొనేందుకు యాత్రను అడ్డుకున్నారని అన్నారు. కూతురు పై ఆరోపనలు వచ్చాయి సస్పెండ్ చెయ్ కేసీఆర్ అంటూ అన్నారు. నిజాయితీని కాపాడుకో కోర్టుకు ఎక్కితే తెలుస్తదిగా అంటూ ఎద్దేవ చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేపించడము ఎందుకు? అని ప్రశ్నించారు. తన కూతురు స్కామ్ బయట పడుతుందని డ్రామాలు చేస్తుండని ఆరోపించారు. బీజేపీ నేతలకు అండగా జనం ఉంటున్నారని తెలిపారు. మీ బలం ఎంటో బీజేపీ పార్టీ వలం ఏంటో తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. పోలీసులు అధికారులు డ్యూటీ చేయలేక బాధ పడుతున్నారని అన్నారు. 27 న జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వరంగల్ లో బహిరంగ సబకు వస్తారు.మరలా యాత్ర జరుపుతామాన్నారు. లిక్కర్ స్కామ్ పై తగ్గేది లేదని, బీజేపీ కండువాలు వేసుకుని వచ్చి దాడులు చేశారని ఆరోపించారు. కేంద్ర ము చేసిన తప్పులు చెప్పమని కేసీఆర్ ని కోరుతున్నానని బండి సంజయ్ ఆరోపించారు.
Shubman Gill: విదేశీ గడ్డపై ఈ రికార్డు సాధించిన ఏకైక భారతీయ క్రికెటర్ అతడే..!!