Bandi Sanjay: గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ ఎత్తేస్తారేమో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్-రాజ్‌భవన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది… గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలపై విమర్శలు గుప్పించడం.. ఈ మధ్యే హస్తినలో పర్యటించి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన తర్వాత.. టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం అనే తరహాలో ఆమె చేసిన వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, అదే రేంజ్‌లో టీఆర్‌ఎస్ నుంచి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేవారు.. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వారు గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తారన్న ఆయన.. సీఎం కేసీఆర్ ఒకవేళ ప్రధాని అయితే గవర్నర్ వ్యవస్థను ఎత్తేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Singareni: సింగరేణి బోర్డు కీలక నిర్ణయాలు.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ఇక, గవర్నర్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం ఏది చేస్తే దానికి రబ్బరు స్టాంప్ లా వ్యవహరించాలా? అంటూ ప్రశ్నించిన ఆయన.. టీఆర్ఎస్ ఆందోళనలో రైతులు ఎక్కడా రావడం లేదన్నారు.. దాన్యం కొనాల్సింది సీఎం కేసీఆరేనని డిమాండ్ చేశారు. మరోవైపు.. బీజేవైఎం ఆధ్వర్యంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్టు వెల్లడించారు.. సీఎం కేసీఆర్ సమాధానం చెప్పే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. మా పార్టీలో ఎవరు ఉన్న కూడా పార్టీపరంగా చర్యలు తీసుకుంటాను.. ఫస్ట్ టెస్ట్‌లు చేయాలని సవాల్ చేశారు.. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ఎంత మందిపై చర్యలు తీసుకున్నావు కేసీఆర్? అని నిలదీశారు.. ఈడీకి డ్రగ్స్ రిపోర్టు ఎందుకు ఇవ్వడం లేదు.. నీ కుటుంబానికో.. నీ పార్టీ నేతలకు సంబంధం ఉంది.. కాబట్టే ఇవ్వడం లేదు అని ఆరోపించారు. అంతర్జాతీయ సంబంధాలు పెంచుకునేందుకు డ్రగ్స్ దందాకి ప్రోత్సహిస్తున్నారేమో అంటూ సెటైర్లు వేశారు. అర్థరాత్రి పబ్‌లకు అనుమతి ఇచ్చింది ఎవరు.. అంతా నీ కుటుంబ సభ్యులవే కదా? మొన్న ఎంత మందికి టెస్ట్ చేశారు.. ఎందరు డ్రగ్స్ తీసుకున్నారు.. ఆ కేసుకు ప్రాధాన్యత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల పై విమర్శలు సరికాదు… ఏ పార్టీ అయినా సరే… డ్రగ్స్ దందాకు హైదరాబాద్ అడ్డాగా మారింది.. ఇక,చ రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.
తాజావార్తలు
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..