తెలంగాణ, ఆంధ్ర సీఎంలు కలిసి రావాలి..!

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది అంటూ మండిపడ్డారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యూపీలో మంత్రిగా ఉండి రాజీనామా చేసిన మౌర్య పై ఏడేళ్ల క్రితం పెట్టిన కేసులు బీజేపీ బయటకు తీసి వేధిస్తోందని.. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఫైర్‌ అయ్యారు. ఇక, ధరల నియంత్రణలో బీజేపీ ఘోరంగా విఫలం అయ్యిందని విమర్శించిన రాఘవులు.. ఎరువుల ధరలు నియంత్రణ పై చొరవే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పెరుగుతున్న ధరలపై ఆందోళనలకు సిద్దం అవుతున్నాం.. ఫిబ్రవరిలో కార్మికుల సమ్మెకు తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు.. సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కేరళ సీఎం అందరూ సీఎంలతో సంప్రదింపులు చేస్తున్నారని.. తెలంగాణ, ఆంధ్ర సీఎంలు కూడా కలిసి రావాలని కోరారు బీవీ రాఘవులు..

Read Also: కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి..

Related Articles

Latest Articles