Bandi Sanjay Kumar: కేసీఆర్‌కు బీజేపీ ఫీవర్ పట్టుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar Controversial Comments On CM KCR: గురువారం ప్రజాగోస – బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఆయనకు ఎలక్షన్ ఫీవర్ కాదు, బీజేపీ ఫీవర్ పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ధాన్యం తడిసిపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. పంటను కాపాడలేని సీఎం, ఇక ప్రజల్ని ఏం కాపాడుతారని ప్రశ్నించారు. రైతులకు కేసీఆర్ రుణమాఫీ చేయడం లేదని, తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల కోసమే ఈ ‘ప్రజాగోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీ అని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో.. ఈడీ విచారణపై కాంగ్రెస్ నేతలు బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై చేస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవమని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఆగస్ట్ 2 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోన బీజేపీ, తాజాగా ఈ ‘ప్రజాగోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టింది. దాదాపు పది రోజులపాటు కొనసాగనున్న ఈ ర్యాలీ సందర్భంగా.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్ని చుట్టేయాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా.. ప్రజలు సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాల్ని బీజేపీ ఎండగట్టనుంది. ఆ సమస్యల్ని తాము పరిష్కరిస్తామని భరోసానిస్తూ.. తమకు అధికారం కట్టబెట్టాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడమే ఈ ర్యాలీ లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని గురువారం బండి సంజయ్ సిద్దిపేటలో ప్రారంభించారు.
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్‌కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్‌లో అసలేం తినలేమా?
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!