తెలంగాణలో అధికారమే లక్షంగా బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఆందోల్ నియోజకవర్గంలోని ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీని రాయికోడ్ మండలంలోని సీరూర్ గ్రామంలో మాజీమంత్రి బాబూమోహన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.