Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని నగరంలోని ఐటీ కారిడార్‌లో నిత్యం నరకం చూపిస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ అమలవుతూ విజయవంతమైన ‘వన్-వే లూప్’ విధానాన్ని ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోనూ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయే సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ సరికొత్త ప్రణాళికను రూపొందించారు.
పీక్ అవర్స్‌లో తప్పనున్న నరకం ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీసులకు వెళ్లే, వచ్చే ఉద్యోగులతో బయోడైవర్సిటీ, నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్ స్థంభించిపోతోంది. దీనికి ప్రధాన కారణమైన 4 కీలక బాటిల్‌నెక్ పాయింట్లను శాశ్వతంగా ఎత్తివేయాలని పోలీసులు నిర్ణయించారు. కూడళ్ల వద్ద వాహనాలు ఆగిపోకుండా ఉండేలా నిరంతరాయ ‘సిగ్నల్ ఫ్రీ వన్-వే లూప్’ విధానాన్ని తీసుకురానున్నారు.
Also Read
- Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
- TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
- Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన "ఇండియాస్ మావోయిస్ట్స్" పుస్తకావిష్కరణ
- Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
ప్రతిపాదిత ‘వన్-వే లూప్’ రూట్ మ్యాప్:
* బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ప్రారంభం
* ఐకియా (IKEA) రోటరీ మీదుగా రహేజా మైండ్‌స్పేస్ (సి-గేట్)
* అక్కడి నుంచి నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ మార్గం
* అనంతరం మై హోమ్ భూజా వద్ద కుడి మలుపు (రైట్ టర్న్) తీసుకుని తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా రూట్‌ను రూపొందించారు.
రోడ్ల పూర్తి వినియోగం.. త్వరలోనే ట్రయల్ రన్
ఈ వన్-వే లూప్ అందుబాటులోకి వస్తే రహదారుల పూర్తి వెడల్పు సమర్థవంతంగా వినియోగంలోకి వస్తుంది. సిగ్నళ్ల వద్ద వేచి ఉండే అవసరం లేకుండా వాహనాలు సాఫీగా ముందుకు సాగిపోతాయి. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడానికి ముందు క్షేత్రస్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు సైబరాబాద్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగం సత్ఫలితాలనిస్తే ఐటీ కారిడార్ ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టేనని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
-
MEA: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి..
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
School Holiday in AP: ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో రేపు కూడా 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..