Bandi Sanjay: కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్.. రాజీనామా పత్రంతో రమ్మను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
bandi sanjay fire KTR and KCR: కేంద్ర నిధులపై కేటీఆర్ మీ అయ్యతో చర్చకు సిద్దం.. రాజీనామ పత్రం పట్టుకొని మీ అయ్యను రమ్మను అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సవాల్ చేసి తోక ముడుచుకొని పారిపోయింది మీరంటూ గుర్తు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడండి .. రాజకీయాలు తర్వాత అంటూ చురకలంటించారు. రుణ మాఫీ చేయక పోవడం వల్ల రైతు బందు నిధులను బ్యాంక్ లు తమ ఖాతాలో వేసుకున్నాయని ఆరోపించారు. నాలుగైదు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు లిస్ట్ ను చెక్ చేసుకోండని, ఓట్లను నమోదు చేసుకోవాలని, మన వల్ల ఓట్లను నమోదు చేయించండని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతోనే సాధ్యమన్నారు. బూత్ కమిటీ సభ్యుడు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు కావొచ్చు జాతీయ అధ్యక్షుడు కావొచ్చు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేంద్ర నిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండపిడ్డారు బండి సంజయ్.
Read also: Hyderabad Crime: అమ్మాయిలకు వల.. 60 వేల జీతం అంటూ వ్యభిచారం
Also Read
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
- Medico Priyanka : కిమ్స్‌లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. 22 నోటిఫికేషన్ లు 20 వేల ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చిందని, ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చిందో ఈ ప్రభుత్వం చెప్పడం లేదని బండి సంజయ్ అన్నారు. మద్యం వల్ల వచ్చే ఆదాయం అంతకు పది వేలు ఎక్కువ వస్తుందని అన్నారు. మిగతా ఆదాయం అంతా ఎటు పోయింది? అని ప్రశ్నించారు. ప్రజలు కట్టిన పన్ను ఎటు పోయిందో జాడ లేదన్నారు. బీజేపీకి అధికారం ప్రజల కోసమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఉంటుందని మరో సారి బయట పడ్డదని అన్నారు. ఇప్పుడు పోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఫిర్యాదు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు నకల్ కొట్ట డానికి అఖల్ ఉండాలని కాంగ్రెస్ ను విమర్శించారు. హిందూ దేవి దేవతలను కించ పరుస్తూ ఉంటే భారిద్దామా? అంటూ ప్రశ్నించారు. హిందూ దేవతలను అవమానిస్తే.. కొడుకులను ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sankranti Holidays: తెలంగాణ స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటినుంచంటే?
తాజావార్తలు
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!