Bandi Sanjay: బండి సంజయ్‌కి BJP కీలక బాధ్యతలు.. కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. బండి సంజయ్ ను కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తన సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. కీలక శాఖలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఇందులో బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ సహా పార్టీ సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జి బండి సంజయ్ కుమార్, యువమోర్చా ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్, ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్ బైజ్యంత్ జె పాండా, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జ్ డాక్టర్ రాధా మోహన్‌దాస్ అగర్వాల్, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) మోర్చా ఇంచార్జీగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్చార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను నియమించినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
Read also: Telangana Government: కాంగ్రెస్ మరో హామీ..! నెలాఖరులోగా అమలుకు కసరత్తు..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఈ మేరకు పార్టీలో మార్పులు చేసింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. దీంతో సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పట్లో ఆయనకు కేంద్రమంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ పార్టీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. సంజయ్ తో పాటు కీలక నేతలు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న వాదన తెరపైకి వచ్చింది. సంజయ్ ఎన్నికలకు వెళ్లి ఉంటే.. బీజేపీ కనీసం 30 సీట్లు గెలిచి ఉండేదని.. ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా ఉండేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనకు ఆ నష్టాన్ని పూడ్చేందుకు కిసాన్ మోర్చా ఇన్ చార్జిగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
Land Grabbing: భూ కబ్జా కేసులపై ఫోకస్ పెట్టిన సీపీ.. పీడీ యాక్ట్, అవసరమైతే నగర బహిష్కరణ..!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!