గత శుక్రవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో 5 వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనపై హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధతో ఫోన్ లో మాట్లాడి నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. బాధిత బాలికకు పునరావాస ఏర్పాట్లు చేయాల్సిందిగా, అలాగే బాలికకు కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి నిందితుడు షెరీఫుద్దీన్ ని కఠినంగా శిక్షించాలని బండారు దత్తాత్రేయ కోరారు. పోలీస్ కమీషనర్ సానుకూలంగా స్పందించి బాలిక ఉన్నత చదువులకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ కి హామీ ఇవ్వడం జరిగింది.
Pawan Kalyan: కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్