మోడీ తూటాలకు తెలంగాణ బిడ్డ బలయ్యారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలకు వరంగల్ బిడ్డ రాకేష్ బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఫాసిస్ట్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మండి పడ్డారు. బీజేపీ కి ఇక శంకర గిరి మాన్యాలే అంటూ విమర్శించారు. మా తెలంగాణ బిడ్డల రక్తం కళ్ళ జూసిన వారెవ్వరూ బాగు పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి పుట్టగతులు లేకుండా చేస్తామని నిప్పులు చెరిగారు.…