Mancherial: మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటిల్లో ముసలం మొదలైంది. మెజార్జీ మున్సిపాలిటిల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంచిర్యాల,నస్పూర్ ,లక్షెట్టిపేట,బెల్లంపల్లి మున్సిపాలిటిల్లో అవిశ్వాసానికి ప్రయత్నాలు సిద్దమయ్యారు. చేయిజిక్కించుకునేలా హస్తంపార్టీ యత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటిల కౌన్సిలర్లు కలెక్టర్ కు నోటీసులు ఇచ్చారు. కాగా.. ఈనెల 11న మంచిర్యాలలో బలపరీక్ష నిర్వహించనున్నారు. ఇక్కడ 36 మంది కౌన్సిలర్లకు గాను, 26 కాంగ్రెస్ వాళ్లున్నారు. ఈనెల 12 వతేదీన, బెల్లంపల్లి, నస్పూర్ మున్సిపాలిటిల్లో విశ్వాస పరీక్ష జరగనుంది. నస్పూర్ లో 25 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ వైపు 19 మంది ఉన్నారు. ఇక బెల్లంపల్లిలో 21 మంది ఉండగా 12 మంది వరకు కాంగ్రెస్ వైపు ఉన్నారు. తాజాగా లక్షెట్టిపేట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు కలెక్టర్ కు అవిశ్వాసం కోసం నోటిస్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇక్కడ మొత్తం 15 మంది కౌన్సిలర్లుండగా.. 10 మంది కాంగ్రెస్ వైపు ఉన్నారు. పాలక వర్గాల మార్పు కోసం కాంగ్రెస్ దూకుడు పెంచింది.
Read also: Mahesh Babu: బాబు బీడీని వదలట్లేదుగా…
కాగా.. అధికార కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ లో చేరిన మేయర్లు, చైర్మన్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తిరగబడుతున్నారు. వారి ఏకపక్ష వైఖరిని, పార్టీ పక్షపాతాన్ని సహించబోమన్నారు. నిబంధనల ప్రకారం ఇన్నాళ్లూ తమపై అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో చేతులు దులుపుకున్నారు. దీంతో వారికి కోపం వచ్చింది. అయితే ఈ నెలాఖరుతో నాలుగేళ్లు పూర్తి కావడంతో తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో చేతులు కలిపి సొంతపార్టీకి చెందిన మేయర్, చైర్మన్‌లను నిలదీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీల్లో కూడా అవిశ్వాసానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే..
Soft water Jobs Fraud: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ టోకరా.. లక్షలు గుంజిన వ్యక్తి!