Assault on Auto Driver: హైదరాబాద్ నగరశివారు పాతబస్తీ షాహిన్ నగర్ లో అర్దరాత్రి ఆటో డ్రైవర్ దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్టేషన్ పరిధి షాహిన్ నగర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ ఛావూస్ అనే యువకున్ని నలుగురు స్నేహితులు హత్యచేసారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన మృతుని హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్దరాత్రి ఒంటి గంటకు ఛావూస్ స్నేహితులు సయ్యద్ అమేర్, మహమ్మద్ జాహేర్, మహమ్మద్ మహబూబ్, షేక్ సోహేల్ కలిసి ఎస్-ప్రీసియో కార్ లో రాయల్ హోటల్ కు వెళ్ళారు. రాయల్ హోటల్ లో టి-తాగి అక్కడి నుండి కారులో ఎర్రకుంటా వెళ్ళారు ఛావూస్ ను నిర్మాణుష ప్రాంతంలో తీసుకెళ్లారు. తరువాత నలుగురు ఛావూస్ ను కత్తితో పొడిచి అతి దారుణంగా హత్యచేశారు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే హోల్ కు వెళ్లినప్పుడు వీరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లేక డబ్బుల వ్యవహారంలో ఇలా చేశారా? అమ్మాయి విషయంలో ఏమైనా గొడవ జరిగిందా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితులను వెతికి పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఆటో డ్రైవర్ హత్యతో ఎర్రకుంటా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఛావూస్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Gummadi SandyaRani: జగన్ రైతులకు న్యాయం చేసిందేం లేదు