Worse in Warangal: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నా కొడుకును తండ్రి అమ్మాకానికి పెట్టిన తీరు యావత్ ప్రపంచానికే దిగ్భాంతి కలిగేలా చేసింది. ఆర్థిక ఇబ్బందులో లేక ఎందుకు తనకు భారం అనుకున్నాడో తెలియదు కానీ.. కన్నకొడుకును తల్లికి తెలియకుండా అమ్మేశాడు తండ్రి. కన్న తండ్రి వేలు పట్టుకుని బయటకు వెళదామంటే సరే అని తల ఊపుతూ తనతో వెళ్లిన కొడుకును రెండు లక్షల 50 వేలకు అమ్మడంతో తండ్రి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కొడుకు. ఎవరితో వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తుండిపోయాడు. వేలు పట్టుకుని వచ్చిన నాన్నతో వెళ్లడానికి సిద్దమైన కొడుకును వేరే వారికి అప్పగించి వెళుతున్న నాన్నను “నాన్న” అంటూ పిలిచిన ఆ కసాయి తండ్రి వెనుతిరిగి కూడా చూడలేదు. చివరకు ఏడుస్తూ వారి భుజాలమీదే తలను పెట్టుకుని కంట నీరు వస్తున్నా ఏం చెప్పాలో అర్థం కానీ ఆ పసి హృదయాన్ని అర్థం చేసుకునేవారు కరవయ్యారు. కొడుకు కనిపించకపోవడంతో తల్లి వెతకడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. తండ్రే కన్న కొడుకును తీసుకుని వెళ్ళాడని అనుమానం వచ్చి ప్రశ్నించడంతో భర్త గుర్తు రట్టైంది.
Read also: Namibia Study Tour: చిరుతలు ఎందుకు చనిపోతున్నాయి?.. అధ్యయనం కోసం నమీబియా స్టడీ టూర్
వరంగల్ జిల్లా మసూద్ కుటుంబం నివాసం ఉంటుంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే మసూద్ పెద్దకొడుకు అయాన్ ను అమ్మేందుకు ప్లాన్ వేశాడు. హైదరాబాద్ చెందిన ఓ కుటుంబానికి రెండు లక్షల 50 వేలకు అమ్మేందుకు బేరసారాలు చేశాడు. ఈ వ్యవహారం నడిపేందుకు శఖరాసికుంటకు చెందిన ఓ మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. చివరకు రెండున్నర లక్షలు ఇచ్చేందుకు ఇప్పుకుంది. అయితే.. నాలుగు రోజులుగా 4 ఏళ్ల తన పెద్ద కొడుకు అయాన్ కనిపించకపోవడంతో తండ్రిని ప్రశ్నించింది. ముందు తన సోదరి దగ్గర ఉంచినట్లు మసూద్ బుకాయించాడు. దీంతో మసూద్ మాటల పైన అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. బాలుడిని రెండు లక్షల 50 వేలకు అమ్మినట్లు తండ్రి చెప్పడంతో భార్య, కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. కన్న బిడ్డను ఎలా అమ్మావు అంటూ ఛీదరించుకున్నారు. అయినా మసూద్ లో మనస్తాపం ఎక్కడా కనిపించలేదు. ఇక కొడుకును ఇంటికి తెచ్చుకుంటూ అంటూ భార్య చెప్పినా మసూద్ వినలేదు. నాకు తెలియదు వారు ఎక్కడకు తీసుకెళ్లారో అంటూ మాట దాటేశాడు. ఇక బాలుడి మేన మామ మసూద్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
MS Dhoni: దటీజ్ ధోనీ.. మిస్టర్ కూల్ స్ట్రాటజీలే వేరప్ప.. మెరుపు కంటే వేగం..!