అబ్బాయిల పెళ్లి వయసును 18 ఏళ్లకు తగ్గించండి: ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి.. 18 ఏళ్లకు తగ్గించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొన్నారు.
Read Also:అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
Also Read
18 ఏళ్ల వయసున్న వారు ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చు.. వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ప్రధానమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు కానీ పెళ్ళి మాత్రం చేసుకోకూడదా ? అని నిలదీశారు. సెక్స్ వల్ రిలేషన్ షిప్ లో ఉండేందుకు, లివింగ్ పార్ట్నర్ షిప్ తో ఉండడానికి నిర్ణయం తీసుకోవచ్చు కానీ.. వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంచుకో కూడదా ? అంటూ ఓవైసీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
దేశంలో ప్రతి నలుగురు అమ్మాయిలలో ఒకరికి 18 ఏళ్ల లోపే పెళ్లి చేస్తున్నారని… కానీ వాటిపై కేవలం 785 క్రిమినల్ కేసులు మాత్రమే నమోదయ్యాయని గుర్తుచేశారు. నిజంగా మహిళలపై ప్రధాని మోడీకి ప్రేమ ఉంటే వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని మెరుగు పరిచేందుకు అవకాశాలు కల్పించాలని, ఉపాధి, ఉద్యోగాలు అందించాలని డిమాండ్ చేశారు. మహిళల ఓట్ల కోసమే ఇలాటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!