Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News All Set For Yadadri Mahakumbasamprokshana

Yadadri: మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం

Published Date :March 27, 2022 , 7:55 pm
By NTV WebDesk
Yadadri: మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం
  • Follow Us :
  • google news
  • dailyhunt

యాదాద్రి లో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. యాదాద్రి లో రేపు జరగనున్న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రధానాలయంలో భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు దర్శనమివ్వనున్నాడు. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధానాలయంలో సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. దీంతో యాదాద్రి కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం లో భాగంగా సీఎం కేసీఆర్ 12 వందల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నిధులతో యాదాద్రి పునర్నిర్మాణం చేశారు. రేపు జరగనున్న మహా సంప్రోక్షణ మహోత్సవానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.యాదాద్రి ఆలయ మహా సంప్రోక్షణ మహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రిలో కార్యక్రమాలు సజావుగా సాగడానికి పోలీస్‌, రెవెన్యూ, వైద్యారోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
  • Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
  • Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
  • BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్

Service to #devotees is service to #God: #CP_Rachakonda Sri. #Mahesh_Bhagwat_IPS.
Today In view of the forthcoming #inauguration ceremony of #Yadadri Sri. #Lakshmi_Narasimha_Swamy_Temple on 28.03.2022, #CP_Rachakonda reviewed the security arrangements in temple premises. pic.twitter.com/uodpeRFiVP

— Rachakonda Police (@RachakondaCop) March 27, 2022

యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి మూడు వేల మందితో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేశారు. 400 సీసీ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. సీఎం కేసీఆర్ తో సహా ప్రముఖులు సంప్రోక్షణ మహోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్ బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. కొండపై కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. యాదాద్రి ప్రధానాలయం పునర్నిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు.. నేటితో బాలాలయంలో భక్తులకు దర్శనాలు  ముగియనున్నాయి.యాదాద్రి ఉద్గాటన నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 7 రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహిస్తున్నారు.

108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువును నిర్వహిస్తున్నారు.. రేపు ఉదయం 11.55 గంటలకు నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వయంభువుల దర్శనభాగ్యం కల్పించనున్నారు. మహా పూర్ణాహుతి అనంతరం ఉత్సవ మూర్తులను శోభాయాత్రతో ప్రధానాలయంలోకి తీసుకొస్తారు. ఆలయ గోపురాలకు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం కలశాలను బిగించి, ప్రధానాలయంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తారు. సీఎం కేసీఆర్‌ మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొని స్వయంభువులను దర్శించుకొంటారు. ఈ కార్య్రమానికి అందరూ ఆహ్వానితులేనని, ప్రత్యేక ఆహ్వానాలు ఏమీ లేవని అంటున్నారు అధికారులు. 29 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు.

https://ntvtelugu.com/bjp-action-plan-on-power-tariff-hike-protests/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • common devotees
  • mahakumba samprokshana
  • telangana tirupati
  • temple renovation

తాజావార్తలు

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions