యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పున ప్రారంభం అవుతోంది. యాదాద్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మహాకుంభ సంప్రోక్షణ లో పాల్గొంటున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి కి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళారు కేసీఆర్ దంపతులు. బాలాలయం నుంచి ప్రారంభమైంది శోభాయాత్ర. స్వామి, అమ్మవార్ల యంత్రాలు, సువర్ణ ప్రతిష్ఠాలంకర మూర్తుల విగ్రహాలను వేద పండితులు, రుత్వికుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలతో ప్రధానాలయం వరకు మొదలైంది శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్…
యాదాద్రి లో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. యాదాద్రి లో రేపు జరగనున్న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రధానాలయంలో భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు దర్శనమివ్వనున్నాడు. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధానాలయంలో సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. దీంతో యాదాద్రి కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.…