Vemulawada : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుతం అభివృద్ధి పనులు, ఆలయ విస్తరణ కారణంగా తాత్కాలికంగా దర్శనాలను రద్దు చేసింది. అయితే, కార్తీక మాసంలో రాజన్న దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ప్రధాన ఆలయం మూసివేయడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులను భక్తులు స్వాగతిస్తున్నప్పటికీ, ముందస్తు సమాచారం లేకుండానే బుధవారం (నవంబర్ 11) ఉదయం నుంచి దర్శనాలను నిలిపివేయడంపై తీవ్ర…
KCR : నాటి కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి.. ఈనెల 23 న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరి గుట్ట పునర్నిర్మాణ కర్త, బి ఆర్ ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుని ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అనంతరం…మార్చి నెల 1 నుంచి 11 వ తారీఖు…
యాదాద్రి లో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. యాదాద్రి లో రేపు జరగనున్న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రధానాలయంలో భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు దర్శనమివ్వనున్నాడు. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధానాలయంలో సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. దీంతో యాదాద్రి కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.…