Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Shivaji OTT : బాక్సాఫీస్ వద్ద ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న ‘రాజా శివాజీ’ ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ హిస్టారికల్ మూవీ ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మరాఠీ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంట్లోనే ఈ విజువల్ స్పెక్టాకిల్‌ను చూసే అవకాశం లభించింది. రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటించిన ఈ చిత్రం, స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ సాగించిన పోరాటాన్ని అద్భుతమైన విజువల్ ట్రీట్‌గా ఆవిష్కరించింది. దీంతో ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
2026 మే 1న థియేటర్లలో విడుదలైన ‘రాజా శివాజీ’ మరాఠీ సినీ పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించింది. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటిన తొలి మరాఠీ చిత్రంగా నిలిచిన ఈ సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రంగా కూడా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు, అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్, అత్యధిక సింగిల్ డే వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా నిలిచింది. రూ.50 కోట్లు, రూ.100 కోట్ల కలెక్షన్స్ ను అత్యంత వేగంగా చేరుకున్న సినిమాగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది ఈ మూవీ.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఈ భారీ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ తో పాటు, జెనీలియా దేశ్‌ముఖ్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్, మహేశ్ మంజ్రేకర్, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్, సచిన్ ఖేడేకర్, అమోల్ గుప్తే, జితేంద్ర జోషి, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించడం కూడా సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ కలసి నిర్మించిన ఈ చిత్రానికి సంగీత ద్వయం అజయ్ అతుల్ సంగీతం అందించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ అద్భుతమైన విజువల్స్‌తో సినిమాకు ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చారు. థియేటర్లలో చరిత్ర సృష్టించిన ‘రాజా శివాజీ’ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
- Tags
- cinema
- Raja Shivaji
తాజావార్తలు
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?