QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
- ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
- షెడ్యూల్ H2 కింద కొత్త నిబంధనలు
- QR కోడ్ స్కాన్ చేస్తే ఏ సమాచారం తెలుస్తుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో నకిలీ, నాసిరకం మందుల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్, క్యాన్సర్ మందులు, నార్కోటిక్, సైకోట్రోపిక్ ఔషధాలపై QR కోడ్ లేదా బార్కోడ్ తప్పనిసరిగా ఉండేలా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో వినియోగదారులు, వైద్యులు, ఫార్మసీలు ఒక్క స్కాన్‌తోనే ఔషధం అసలైనదా? నకిలీదా? అనే విషయాన్ని సులభంగా గుర్తించొచ్చు.
షెడ్యూల్ H2 కింద కొత్త నిబంధనలు
1945 ఔషధ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తూ, ఈ వర్గానికి చెందిన మందులను షెడ్యూల్ H2 పరిధిలోకి తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం సంబంధిత అన్ని ఔషధాలపై ట్రాక్-అండ్-ట్రేస్ సిస్టమ్ అమలు చేయడం తప్పనిసరి.
Also Read
- BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
- DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
ఎక్కడ QR కోడ్ ఉండాలి?
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఔషధాల ప్రాథమిక ప్యాకేజింగ్ (వయల్, బాటిల్, స్ట్రిప్ లేదా లేబుల్)పై QR కోడ్ లేదా బార్కోడ్ ముద్రించాలి. ఒకవేళ ప్యాకెట్ పరిమాణం చిన్నగా ఉండి కోడ్ ముద్రించడానికి వీలు లేకపోతే, బయటి ప్యాకేజింగ్ (కార్టన్ బాక్స్)పై QR కోడ్‌ను ఉంచవచ్చు.
QR కోడ్ స్కాన్ చేస్తే ఏ సమాచారం తెలుస్తుంది?
వినియోగదారులు లేదా అధికారులు QR కోడ్‌ను స్కాన్ చేయగానే ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. వాటిలో ముఖ్యంగా…
ప్రత్యేక ఉత్పత్తి గుర్తింపు సంఖ్య (Unique Product ID)
జెనరిక్, బ్రాండ్ పేరు
తయారీ సంస్థ పేరు, చిరునామా
బ్యాచ్ నంబర్
తయారీ తేదీ, గడువు తేదీ
తయారీ లైసెన్స్ నంబర్
ఔషధంలో ఉపయోగించిన పదార్థాల వివరాలు. ఈ సమాచారంతో మందు అసలైనదో, నకిలీదో సులభంగా గుర్తించవచ్చు.
ట్రాక్-అండ్-ట్రేస్ వ్యవస్థ విస్తరణ
ఇప్పటివరకు ఈ ట్రాక్-అండ్-ట్రేస్ వ్యవస్థ దేశంలోని టాప్ 300 ఫార్మా బ్రాండ్లకు మాత్రమే పరిమితమైంది. తాజా నిర్ణయంతో దీని పరిధిని మరింత విస్తరించి.. అన్ని వ్యాక్సిన్లు, యాంటీమైక్రోబియల్ మందులు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, NDPS చట్టం, 1985 పరిధిలోకి వచ్చే నార్కోటిక్, సైకోట్రోపిక్ మందులు వంటి కీలక ఔషధాలన్నింటికీ వర్తించేలా కేంద్రం నిర్ణయించింది.
నకిలీ మందులపై కఠిన చర్యలు
దేశంలో నకిలీ మందుల తయారీ, విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది. QR కోడ్ వ్యవస్థ ద్వారా తయారీ సంస్థ నుంచి వినియోగదారుడి వరకు ప్రతి దశలో ఔషధాన్ని ట్రాక్ చేయడం సులభం కానుంది. దీంతో సరఫరా గొలుసులో ఎక్కడైనా నకిలీ మందులు చేరితే వాటిని వేగంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
యాంటీబయాటిక్ నిరోధకతపై కూడా ప్రభావం
నాసిరకం, నకిలీ యాంటీబయాటిక్ మందుల వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) సమస్య పెరుగుతోంది. కొత్త QR కోడ్ విధానం అమలులోకి రావడం ద్వారా నాణ్యమైన మందులు మాత్రమే వినియోగదారులకు చేరే అవకాశం పెరుగుతుందని, తద్వారా AMRపై భారతదేశం చేస్తున్న పోరాటానికి కూడా ఇది బలాన్నిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
వినియోగదారులకు ప్రయోజనం
ఈ కొత్త విధానం అమలుతో వినియోగదారులు కొనుగోలు చేసే మందు అసలైనదేనా? ఎక్కడ తయారైంది? ఎప్పుడు తయారైంది? గడువు ఎప్పుడు ముగుస్తుంది? వంటి కీలక వివరాలను మొబైల్‌తో QR కోడ్ స్కాన్ చేసి వెంటనే తెలుసుకోవచ్చు. దీంతో నకిలీ మందుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు ప్రజల ఆరోగ్య భద్రత కూడా మరింత బలోపేతం కానుంది.
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!