NTV Telugu Site icon

కేసీఆర్‌ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ప్రారంభం..

KCR

KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది… సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ పథకంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. ఈ సమావేశానికి అన్ని పార్టీల‌కు చెందిన ద‌ళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్‌, బీజేపీల‌కు చెందిన ఫ్లోర్ లీడ‌ర్లు, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి సీనియ‌ర్ ద‌ళిత నేత‌లు, ద‌ళిత వ‌ర్గాల అభ్యున్నతి కోసం పాటుప‌డుతున్న రాష్ట్రంలోని ఇత‌ర సీనియ‌ర్ ద‌ళిత నాయ‌కులకు ఆహ్వానాలు వెళ్లగా.. ఈ సమావేశానిక టీఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ ప్రతినిధులు హాజరయ్యారు.. కొంత తర్జనభర్జన తర్వాత కాంగ్రెస్‌ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఈ సమావేశానికి వచ్చారు.. మరోవైపు.. ఇప్పటికే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.. ఇదే సమయంలో.. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ దళిత నేతలు సమావేశం అయ్యారు.. కానీ, అనూహ్యంగా ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమయ్యారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. దీంతో.. అన్ని పార్టీల నేతలు అఖిలపక్ష సమావేశానికి హాజరుఅయినట్టు అయ్యింది.