SAGY: ఆదర్శ గ్రామాలు.. టాప్ 10లో మొత్తం తెలంగాణ గ్రామాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది.. టాప్‌లో నిలవడం అంటే.. ఒక్క స్థానం కాదు.. అందులో ఉన్న పదకి పది స్థానాలు కొల్లగొట్టింది.. గతంలోనూ ఈ జాబితాలో టాప్ 10లో ఆరు, ఏడు స్థానాలు దక్కించుకున్న సందర్భాలు ఉండగా.. ఈ సారి ఏకంగా టాప్ 10 మొత్తం తెలంగాణ గ్రామాలే కావడం విశేషం.. తాజాగా కేంద్రం విడుదల చేసిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) జాబితాలో పదింటిలో 10 గ్రామాలూ తెలంగాణ రాష్ట్రం నుంచే చోటు దక్కించుకున్నాయంటే.. రాష్ట్రంలోని పల్లెల్లో జరుగుతోన్న అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుస్తుంది.
Read Also: KCR behind PK: కేసీఆర్ భేటీ తర్వాత మారిన పీకే మనస్సు..!
Also Read
దేశంలోని గ్రామాల్లో సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, గ్రామ సంఘాల ఐక్యత, సామాజిక సమీకరణపై ప్రజలలో చైతన్యం పెంపొందించడం సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం.. తాజా జాబితాలో మరో రాష్ట్రానికి అవకాశం ఇవ్వకుండా.. అన్ని స్థానాలు కైవసం చేసుకుంది తెలంగాణ.. అంతే కాదు.. ఈ జాబితాలో టాప్ 20 స్థానాల్లో ఒకే ఒక్క స్థానం మినహా మిగతా 19 స్థానాలు కూడా తెలంగాణ గ్రామాలే ఉండడం మరో విశేషం. ఈ జాబితాలో యాదాద్రి జిల్లాలోని వడ్డేపర్తి టాప్‌లో నిలవగా.. కరీంనగర్‌లోని కొండాపూర్, నిజామాబాద్‌లోని పల్డా, కరీంనగర్‌లోని రామకృష్ణాపూర్, యాదాద్రిలోని వెల్మాల్, జగిత్యాలోని మూలరాంపూర్, నిజామాబాద్‌లోని థన్ కూర్దు, కుక్నూర్, కరీంనగర్‌లోని వెన్నంపల్లి వరుసగా టాప్ 10లో నిలిచాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్.. గ్రామాలను అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేసిన సీఎం కేసీఆర్ విజన్‌కు మంత్రి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మరియు మొత్తం టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు కేటీఆర్.
Proud to share that all 10 out of top 10 villages in Sansad Adarsh Garmina Yojana are from #Telangana👏 19 out of top 20 villages from TS
Heartiest congratulations to Hon’ble CM KCR Garu for his vision, especially Palle Pragathi. Compliments to PR Minister @DayakarRao2019 & team pic.twitter.com/z4dhX6I4OV
— KTR (@KTRBRS) April 26, 2022
తాజావార్తలు
-
NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!
-
Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక
-
Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్‌కు శిక్ష..
-
G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
-
Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!