LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Cylinder Shortage: మిడిల్ ఈస్ట్‌లో (పశ్చిమాసియా) ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నాయి. దీంతో భరత్‌లో ఎల్పీజీ (వంటగ్యాస్) సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వ్యాపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, దేశంలో గ్యాస్ కొరత రానివ్వకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు.
హోర్ముజ్ జలసంధి వివాదం వల్ల అంతర్జాతీయంగా కొంత ప్రభావం పడటం సహజమేనని, అయితే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. పరిస్థితిని ముందే ఊహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారని తెలిపారు. ఇదివరకు మనదేశంలో రోజుకు 34,000 టన్నుల ఎల్పీజీ మాత్రమే ఉత్పత్తి అయ్యేదని, ప్రధాని తీసుకున్న చొరవ వల్ల ప్రస్తుతం ఆ ఉత్పత్తి ఏకంగా 55,000 నుంచి 56,000 టన్నులకు పెరిగిందని వివరించారు. దీనివల్ల ఎక్కడా గ్యాస్ కొరత అనేదే లేదన్నారు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న 1.07 లక్షల పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధనం అయిపోలేదని, క్రమం తప్పకుండా సరఫరా జరుగుతోందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు బయటకు వచ్చి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదని, డిజిటల్ బుకింగ్ సదుపాయం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని గుర్తుచేశారు. మనం ఇంట్లో కూర్చుని ఫోన్ ద్వారా యాప్‌లో సిలిండర్ బుక్ చేస్తే, అది 24 గంటల్లోనే మన ఇంటికి చేరుతుందని చెప్పారు.
Also Read
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
అయితే, కొందరు కావాలని గ్యాస్ కొరత ఉందంటూ తప్పుడు ప్రచారాలు సృష్టించారని, దాంతో ప్రజలు భయపడి అవసరానికి మించి సిలిండర్లను దాచిపెట్టుకోవడం (హోర్డింగ్) మొదలుపెట్టారని అన్నారు. గురుగ్రామ్‌లో ఉండే తన కుటుంబ స్నేహితుల ఉదాహరణను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. వారి ఇంట్లో పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ, పుకార్లు నమ్మి ముందుజాగ్రత్తగా ఎక్స్ట్రా సిలిండర్లను కొని పెట్టుకున్నారని చెప్పారు. సాధారణంగా దేశమంతటా రోజుకు సగటున 52 లక్షల సిలిండర్లు ఖర్చవుతుంటే, ఈ కొరత పుకార్ల వల్ల ఒక్కసారిగా ఆ సంఖ్య రోజుకు 90 లక్షలకు పెరిగిపోయిందని వివరించారు. ఒక సగటు కుటుంబానికి ఏడాదికి ఎన్ని సిలిండర్లు కావాలో అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువగా కొనుగోలు చేయడం మొదలుపెడితే అది పంపిణీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తెస్తుందని ఆయన అన్నారు. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్‌ను అరికట్టడానికే ప్రభుత్వం తాత్కాలికంగా గ్యాస్ పంపిణీపై కొన్ని నిబంధనలు తీసొచ్చిందని, వ్యవస్థను క్రమబద్ధీకరించిందని పూరి తెలిపారు.
తాజావార్తలు
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!