Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana 22A Land List: తెలంగాణలో సంచలనంగా మారింది 22A.. రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ వ్యక్తుల భూములను చేర్చిన అంశంపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ భూములను 22A జాబితాలో చేర్చడంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. 22A నిషేధిత జాబితా కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ NHRCకి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 14న ఆయన ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల భూములు నిషేధిత జాబితాలో చేరడంతో ఆస్తుల రిజిస్ట్రేషన్, లావాదేవీల విషయంలో ప్రజలు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు..
ఈ ఫిర్యాదుపై NHRC సోమవారం విచారణ చేపట్టింది. 22A జాబితా కారణంగా ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలుగుతున్న అంశాన్ని సంఘం పరిశీలించింది. జీవించే హక్కు, సమానత్వ హక్కు, వృత్తి లేదా వ్యాపారం నిర్వహించే హక్కు, ఆస్తి హక్కులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను NHRC ప్రస్తావించింది. ప్రత్యేకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19(1)(g), ఆర్టికల్ 300-A కింద ఉన్న హక్కులకు సంబంధించిన అంశాలను NHRC పరిశీలించింది. ప్రైవేట్ వ్యక్తుల భూములు 22A నిషేధిత జాబితాలోకి ఎలా చేరాయి, అందుకు సంబంధించిన నిర్ణయ ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశంపై స్వతంత్రంగా విచారణ జరపాలని ఆదేశించింది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు, కొన్ని నివాస ప్రాంతాలు చేరడంపై ఇటీవలి కాలంలో ఫిర్యాదులు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 22A సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన పెండింగ్ కేసులను పరిశీలించి పరిష్కరించేందుకు కమిటీకి బాధ్యతలు అప్పగించారు. తాజా NHRC ఆదేశాల ప్రకారం, 22A నిర్ణయంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టి, బాధిత ప్రజలకు అవసరమైన ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. చేపట్టిన చర్యలు, విచారణ పురోగతిపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ సీఎస్‌ను NHRC ఆదేశించింది.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..