Thank You Dear Review: “థాంక్యూ డియర్” రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా తదితరులు
- DIRECTOR:
- MUSIC:
- PRODUCER: పప్పు బాలాజీ రెడ్డి
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా కీలక పాత్రలలో నటించిన మూవీ థాంక్యూ డియర్. మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, చత్రపతి శేఖర్, బలగం సుజాత, రామారావు తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. హెబ్బా పటేల్ నుంచి ఈ మధ్యకాలంలో సరైన సినిమా రాలేదు దీంతో ఈ సినిమా అయినా వర్కౌట్ అవుతుందా లేదా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
కథ : దర్శకుడు కావాలనే ఆశయంతో హైదరాబాదులో కష్టపడుతూ ఉంటాడు సత్య (ధనుష్ రఘు ముద్రి). నటి కావాలని కోరికతో ఉన్న జాను (రేఖా నిరోష)తో ఒకే రూమ్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క సత్య ప్రియ (హెబ్బా పటేల్ను) ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు హ్యాపీగా సాగిపోతున్న వారి జీవితాలలో తమ పెళ్లి తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయి? తమ జీవితంలోకి వచ్చిన మరొక అమ్మాయి వల్ల వీరి జీవితాల్లోకి ఎటువంటి మలుపులు వచ్చాయి? వరుస హత్యలు చేస్తుంది ఎవరు? వారికి ఈ దంపతులకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ హత్యలు చేయడానికి గల కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమాను థాంక్యూ డియర్ చిత్రం చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ :
దర్శకుడు తోట శ్రీకాంత్ తాను రాసుకున్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే క్రమంలో కాస్త తడబడ్డాడు. ఎంచుకున్న పాయింట్ మంచిదే కానీ దానిని పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూషన్ చేసే విషయంలో పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. బిజిఎం అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ సినిమాలోని పాటలు సినిమాకు మంచి ఫీల్ తీసుకు వచ్చాయి. డబ్బింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది. డైలాగులు సినిమాలో చాలా బాగా పండాయి. లొకేషన్లు చాలా న్యాచురల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇదేదో కొత్త కథ అనలేం ఎందుకంటే మనం నిజజీవితంలో చూసిన ఎన్నో విషయాలను ఈ సినిమాలో చెంపపెట్టు లా చూపించే ధైర్యం చేశాడు దర్శకుడు. వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి? కొంతమంది చేసే అసాంఘిక చర్యల వల్ల ప్రజలలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటూ చూపించే ప్రయత్నం థాంక్యూ డియర్.
నటీనటుల పర్ఫామెన్స్ :
సినిమాలో హీరోగా తంత్ర ఫ్రేమ్ నటుడు ధనుష్ రఘుముద్రి సత్యం పాత్రలో చాలా బాగా నటించారు. ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడిలా రెండవ సినిమాకి నటించాడు. హెబ్బా పటేల్ (ప్రియా) పాతలో నటించగా కొన్ని వేరియేషన్స్ తో కూడిన తన పాత్రను అద్భుతంగా పండించారు. మరొక హీరోయిన్ రేఖ నిరోషా(జానకి) పాత్రలో అటు ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో పాటు మరొక కోణాన్ని కూడా ఎంతో అద్భుతంగా చేసి చూపించారు. వీరశంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్లు తమ పరిధిలో నటించారు.
సారాంశం : థాంక్యూ డియర్.. ఎంటర్టైన్మెంట్ విత్ మెసేజ్
- Tags
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?