NTV Telugu Site icon

Adluri Laxman Kumar : త్వరలోనే పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా పంపిణీ చేస్తాం….

Adluri Laxman

Adluri Laxman

Adluri Laxman Kumar : జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రిమాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం పై చేసిన అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2014 నుండి 2023 వరకు బి.ఆర్.ఎస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశారో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలన్నారు. జగిత్యాల జిల్లాకు గత ప్రభుత్వ హయంలో ఏం మేలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాకు వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుండి 2023 వరకు గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు ఏం చేశారో జవాబు చెప్పి పాదయాత్రను మొదలుపెట్టండని, మీ ప్రభుత్వ హయంలో మిల్లర్లు కటింగ్ పేరిట రైతులను దోచుకుంటుంటే కనీసం స్పందించని మీరు, రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించని మీరు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

Vidadala Rajini : నాపై తప్పుడు రాతలు రాస్తే పోలీసులు పట్టించుకోలేదు..

మా ప్రభుత్వం వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే అయిందని, ఈ కొద్ది సమయంలోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం,500లకి గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 2లక్షల రుణమాఫీ, ఉద్యోగస్తులకు నియామక ఉత్తర్వులు పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు అమలు చేసి చూపించామని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా పంపిణీ చేస్తామని, ఇన్ని సంక్షేమ పథకాలకు అమలు చేస్తే బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం మా పైన అసత్యాలను ప్రచారం చేస్తూఒక అబద్ధాన్ని నిజం అని పలు మార్లు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేవలం బి.ఆర్.ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి ఒక బూటకపు పాదయాత్రలు చేయడం జరుగుతుందని, ఎన్ని పాదయాత్రను చేసిన వారి మాటలు రైతులు గాని, ప్రజలు గాని నమ్మే పరిస్థితిలో లేరన్నారు అడ్లూరి లక్ష్మణ్‌.

Pushpa 2 Special Song: ‘పుష్ప-2 ది రూల్‌’లో మాసివ్‌ ”కిస్సిక్‌” సాంగ్‌ కోసం డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల

Show comments