ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్సై
- ట్రాక్టర్, జేసీబీ కేసులో రూ.25 వేల డిమాండ్
- ఎస్సై అరెస్టుతో గ్రామంలో సంబరాలు, నినాదాలు
- వేధింపుల ఆరోపణలతో బాధితుల ఆగ్రహం వెల్లువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్ , జేసీబీని వదిలిపెట్టడానికి ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్సై డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
- CM Revanth Reddy : సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో ఆధ్యాత్మిక శోభ
- Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఏసీబీకి చిక్కారన్న వార్త తెలియగానే తిమ్మజిపేట మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే అది భయం వల్ల కాదు, సంతోషంతో.. ఎస్సై వేధింపులకు గురైన బాధితులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. “అవినీతి ఎస్సై డౌన్ డౌన్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
HYDRA : ఇందిరా పార్క్‌లోకి ఎంటరైన హైడ్రా.. ఆ నిర్మాణాలు కూల్చివేత..!
హరిప్రసాద్ రెడ్డి కేవలం లంచం తీసుకోవడమే కాకుండా, ప్రజలను తీవ్రంగా వేధించేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. చాలామందిని డబ్బుల కోసం పీడించడమే కాకుండా, స్టేషన్‌కు తీసుకెళ్లి దారుణంగా కొట్టేవాడని వారు వాపోయారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో ప్రతి ఊరి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులకు సంబంధం లేని భూతగాదాలు, సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు దండుకున్నాడని బాధితులు పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులను వేధించే అధికారులకు ఈ ఉదంతం ఒక గుణపాఠం లాంటిదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఎస్సై హరిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. రక్షక భటుడే భక్షకుడిగా మారితే ప్రజలు ఎలా స్పందిస్తారనే దానికి తిమ్మజిపేటలోని ఈ సంబరాలే నిదర్శనం.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!