We are not Lovers: చిన్న పెద్ద అనే తారతమ్యం వుండదు. చనువుగా వున్నా ఇక వారికి ప్రేమికులు అనేపేరుతో పిలుస్తుంటారు కొందరు. వారిద్దరి మధ్య నిజంగానే ప్రేమనా? లేక ప్రెండ్సిప్ ఆ అనే ఆలోచన కూడా చేయరు. ఎక్కడైనా సరే యువతీ, యువకులు ఇద్దరు కాస్త చనువుగా వుంటే చాలు వారికి లవర్స్ అనే ట్యాగ్ తగిలించేస్తుంటారు. వారు అన్నా చెల్లెలైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే. అంతెందుకు బైక్ పై అన్నా చెల్లెల్లు వెలుతున్నా ఒక రకమైన అనుమానంతో కల్లు తేలేసుకుని చూస్తుంటారు. చనువుగా వున్నంత మాత్రానా ఇక లవర్సేనా వేరే రిలేషన్ షిప్ వుండవా, అన్నా చెల్లెల్లను కూడా అదే ఉద్దేశంలో చూసే పాడు సమాజంలో బతుతున్నామా అనుకున్నారో ఏమో..ప్రేమికులు అనే ముద్ర వేయడంతో భరించలేని యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో చోటుచేసుకుంది. ఈఘటన రెండు రోజుల క్రితం జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
read also: Sea Waves: తీరప్రాంతంలో అలజడి.. హుదూద్ తర్వాత ఆ స్థాయిలో విరుచుకుపడుతోన్న అలలు..
నిజామాబాద్‌లో నందిపేట్ మండలానికి చెందిన ఇద్దరు యువతి, యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈఘటనలో యువకుడు వినయ్‌కుమార్ మృతి చెందగా, యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో.. యువతికి నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానీ.. వీరిపై ప్రేమికులు అనే ముద్ర వేసినందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. మేము ప్రేమికులం కాదని, మాపై ప్రేమికులు అనే ముద్ర భరించలేక పోతున్నామని ఆలేఖలో వున్నట్లు విశ్వనీయ సమాచారం. ఈఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిని ప్రేమికులు అని చెప్పి మనస్తాపానికి గురిచేసింది ఎవరని, లేక వీరి మృతికి ఎవరైనా ప్రోత్సహించారా లేదా వీరిద్దరే బలవన్మరణానికి పాల్పడ్డారా? అనే కోనంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
MLC Kavitha: మునుగోడు టీఆర్‌ఎస్ కంచుకోట.. ఉపఎన్నికల్లో గెలుపు ఖాయం