Hyderabad: తక్కువకు డ్రెస్ కుట్టలేదని టైలర్ షాపు కాల్చేసిన ఘటన హైదరాబాద్ లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. ఫిలింనగర్ లోని లక్ష్మి నగర్ లో ఖదీర్ అనే వ్యక్తి టైలర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. రోజూ లాగానే అందరూ ఖదీర్ వద్దకు వందల మంది బట్టు కుట్టించుకునేందుకు వస్తుంటారు. అలానే మసూద్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. తనకు బట్టలు కుట్టాలని కోరాడు. అయితే ఖదీర్ దానికి సరే అన్నాడు. ఇద్దరి మధ్య బట్టలు కుట్టడానికి డబ్బుల వ్యవహారంలో కాస్త అటు ఇటు అయ్యింది. ఖదీర్ రూ.1200 అవుతుందని తెలిపాడు. దానికి మసూద్ అంతలేదు రూ.800 తీసుకుని కుట్టాలని కోరాడు. ఇద్దరి మద్య వాదోపవాదాలు జరిగాయి. అయినా కూడా ఖదీర్ దానిని కుట్టడానికి చాలా టైం పడుతుందని, అందుకు తను అడిగిన డబ్బులు తక్కువే అని తెలిపారు. అయినా కూడా మసూద్ వినలేదు.. నేను ఇచ్చిన రేటుకే కుట్టాలని కోరాడు.
Read also: Komaravelli: కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భక్తులతో సందడిగా ఆలయం
దీంతో ఖదీర్ బట్టలు కుట్టనని నిర్మొహమాటంగా చెప్పి నీ బట్టులు తీసుకుని వెళ్లమని మసూద్ కు చెప్పాడు. దీంతో ఖదీర్ మాటలకు మసూద్ రగిలిపోయాడు. అతనిపై కోపం పెంచుకున్నాడు. బట్టలు కుట్టకుండా డబ్బులు డిమాండ్ చేయడంతో మండిపోయాడు. అతని షాప్ ను ఎలాగైనా లేకుండా చేయాలని ప్లాన్ వేశాడు. దీంతో ఖదీర్ లేని సమయంలో షాప్ వద్దకు వచ్చాడు. అనుకున్నట్టుగానే షాప్ తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. అంతే షాప్ మొత్తం కాలిబూడిదైంది. దీంతో స్థానికులు ఖదీర్ కు సమాచారం అందించారు. హుటా హుటిన షాప్ వద్దకు వచ్చిన ఖదీర్ తన షాప్ మొత్తం కాలిపోవడాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. మసూద్ పై పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మసూద్ అదుపులో తీసుకుని విచారించారు. దీంతో మసూద్ తనే నిప్పు పెట్టినట్లు అంగీకరించాడు. తనకు తక్కువ రేట్ కు బట్టులు కుట్టనందుకే షాప్ కు నిప్పు పెట్టినట్లు తెలిపాడు.
IND vs ENG: ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్ అయితే.. టీమిండియాది విరాట్ బాల్: గవాస్కర్