IND vs ENG: ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్ అయితే.. టీమిండియాది విరాట్ బాల్: గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక టెస్టు విజయం సాధించిన భారత్.. సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. బాజ్‌బాల్ ఆటనే నమ్ముకున్న ఇంగ్లీష్ జట్టు భారత బౌలర్లపై పై చేయి సాధించాలని చూస్తోంది. అయితే ఉపఖండ పిచ్‌లపై బాజ్‌బాల్ ఆడడం కష్టమే అని మాజీ క్రికెటర్లు అంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ బాజ్‌బాల్‌పై స్పందించాడు. ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్ అయితే.. టీమిండియాది విరాట్ బాల్ అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై కోహ్లీకి మెరుగైన రికార్డు ఉందని గుర్తు చేశాడు.
తొలి టెస్టుకు ముందు స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ఇంగ్లండ్ బాజ్‌బాల్ విధానాన్ని ఎదుర్కోవడానికి భారత్‌కు ‘విరాట్‌బాల్’ ఉందన్నారు. ‘ఇంగ్లండ్ బాజ్‌బాల్ ఆటను కౌంటర్ చేసేందుకు మాకు విరాట్ బాల్ ఉంది. ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్న విధానం, క్రీజులో కదిలే తీరు చాలా బాగుంది. టెస్టుల్లో అర్ధ సెంచరీలను సెంచరీలుగా మలచడం చాలా ముఖ్యం. విరాట్ దాదాపు సమానంగా సెంచరీలు, అర్ధ సెంచరీలను కలిగి ఉన్నాడు. ఇవి మంచి గణాంకాలు’ అని గవాస్కర్ చెప్పాడు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Also Read: Ayodha Ram Mandir: అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక.. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే!
‘గత 1-2 సంవత్సరాలలో టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉన్నా.. ఎటాకింగ్ క్రికెట్ ఆడుతున్నారు. ఈ బాజ్‌బాల్ విధానం భారత స్పిన్నర్లపై పనిచేస్తుందో లేదో చూడాలి. తొలి టెస్ట్ అత్యంత కీలకం. హైదరాబాద్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. బజ్‌బాల్ అప్రోచ్‌కు ఈ పిచ్ సరిగ్గా సరిపోతుంది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లకు అసలు సిసలు పరీక్ష ఎదురుకాబోతుంది’ అని సన్నీ అన్నాడు. 28 టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లీ 42.36 సగటుతో 1991 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!