Lady Robot: అమ్మాయి కాదు రోబోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోబోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్‌లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు. అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి. నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోందనే చెప్పొచ్చు.
ఇలాంటి రోబోను మనం సినిమాలోనే కాదు నిజ జీవితంలో అది మనకు స్వాగతం పలుకుతూ మనకు సర్వ్ చేస్తే ఆ ఆనందమే వేరు. అదే రోబో అమ్మాయి అయితే! అమ్మాయి రోబోనా అనుకుంటున్నారా?. మీరు ఆ రోబోను చూడాలనుకునే వారు యూట్యూబ్ లో వెతకనక్కర్లేదు.. దేశ విదేశాలకు వెళ్లనక్కర్లేదు. మన తెలంగాణ రాష్ట్రంలోనే మన భాగ్యనగరంలోనే ఈ రోబో తయారైంది. ఆ రోబోను చూసి మీరు అమ్మాయి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఆమె ఎవరోకాదు మైత్రి అనే హ్యూమనాయిడ్ రోబో.
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు చెందిన యువ శాస్త్రవేత్తలు ఫణికుమార్, దుర్గాప్రసాద్ దీనిని ఆవిష్కరించారు. రిమోట్ సంకేతాల ఆధారంగా ఇది తన చేతుల్లోని వస్తువులను చెప్పినవారికి అందజేస్తుంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మైత్రిని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్తలు హ్యూమనాయిడ్ రోబో ఆవిష్కరించడం అభినందనీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
పటాన్ చెరు కేంద్రంగా పనిచేస్తున్న సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ మైత్రి పేరుతో హ్యూమనాయిడ్ రోబోను తయారుచేసింది. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా రోబోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అందిస్తున్న ప్రోత్సాహం తో రాష్ట్రంలో యువ శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలు చేయడం సంతోషకరం అన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గం గర్వపడేలా యువ శాస్త్రవేత్తలు ఫణి కుమార్, దుర్గా ప్రసాద్ లు రోబో ని తయారు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, రాంచందర్, షకీల్, యువ శాస్త్రవేత్తలు ఫణి కుమార్, దుర్గా ప్రసాద్ లు పాల్గొన్నారు.
Telugu Desam Party: టీడీపీ ఆధ్వర్యంలో ‘ఛలో కంతేరు’.. మాజీ మంత్రి హౌస్ అరెస్ట్
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!