Kamareddy: అదృష్టం బాగాలేకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరిగిపోతుందన్న సామెత వినే ఉంటారు. అచ్చం అలాంటి ఘటనే కామారెడ్డిలో కూడా జరిగింది. ఓ వ్యక్తి ఫంక్షన్ వెళ్లి బిర్యాని తింటుండగా బోన్ గొంతులో ఇరుక్కుని విలవిలలాడాడు.. ఊపిరి ఆడకపోవడంతో అస్వస్తతకు గురయ్యాడు. చివరకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది.
Read also: NIA Raids: మహారాష్ట్ర-కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాదుల కుట్రపై నిఘా
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన బంధువుల ఇంటిలో ఫంక్షన్ కి వెళ్లాడు. ఇక డిన్నర్ టైం కావడంతో అన్నం తినేందుకు బాలయ్య వెళ్లాడు. బిర్యాని ప్లేట్‌లో వేయించుకుని తింటుండగా ఒక్కసారి అస్వస్థకు గురయ్యాడు. గొంతులో మటన్‌బోన్ ఇరుక్కుపోవడంతో మాటలు కూడా మట్లాడలేకపోయాడు. ఊపిరి ఆడకపోవడంతో విలవిల లాడాడు. దీంతో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు అతన్ని గమనించి ఏం జరిగిందని అడిగినా బాలయ్య సమాధానం చెప్పలేక సైగలు చేశాడు. దీంతో అక్కడున్న వారందరూ గొంతులో ఇరుక్కున్న బోన్ ను తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు చేసేది ఏమీలేక కామారెడ్డిలోని ఆసుపత్రికి బాలయ్యను తీసుకుని వెళ్లారు. బాలయ్యను చూసిన వైద్యుడు సాకేత్ బోన్ తీయకుంటే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బాలయ్యను కాపాడాలని వైద్యునికి కోరగా.. బాలయ్య గొంతులో ఇరుక్కున్న బోన్ ను చాకచక్యంగా డాక్టర్ సాకేత్ బయటకు తీసాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో సమయస్పూర్తితో బాలయ్య ప్రాణాలు కాపాడిన వైద్యుడు సాకేత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో వైద్యుడు సాకేత్ మాట్లాడుతూ ఏదైనా పదార్థాలు తినే టప్పుడు జాగ్రత్త అవసరమని లేదంటే ప్రాణాలతో పోరాడాల్సి వస్తుందని తెలిపారు.
Read also: Income Tax Raid : మూడు రోజుల్లో 300 కోట్లు, నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది
తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడ మండలం కోనాపురానికి చెందిన కుంజా ముత్తయ్య అనే వృద్ధుడు గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయి మృతి చెందాడు. ముత్తయ్య తన కొడుకుతో కలిసి మటన్ కర్రీతో భోజనం చేశాడు. భోజనం చేస్తుండగా ముత్తయ్య గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ముత్తయ్య ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఎంత ప్రయత్నించినా..బోన్ బయటకు రాకపోవడంతో.. ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే.. ముత్తయ్య గతంలో జనశక్తి పార్టీకి చెందిన మూడు జిల్లాలకు డిప్యూటీ ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు. గతంలో ఇదే జిల్లాలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. బాలానగర్ మండలం ఉదిత్యకు చెందిన పోచయ్యగౌడ్ అనే వ్యక్తి… చికెన్ తింటుండగా ప్రమాదవశాత్తు గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. గొంతు అడ్డం పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు పోచయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్..