Child Drinking Pesticide: కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి.. ఆసుపత్రి తరలిస్తుండగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Drinking Pesticide: అప్పటి వరకూ ఇంట్లో ఆడుకుంటూ కుటుంబంతో హాయిగా గడిపింది. నిన్న ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో కాసేపు ఆడుకుందామని బయటకు వెళ్లింది. అంతలోనే ఓఘటన ఆచిన్నారిని కబలించింది. బయట ఆడుకుంటుండగా.. ఓ బాటిల్‌ను చూసింది. కూల్‌డ్రింక్ అనుకుని ఆబాటిల్‌ను తాగడంతో.. ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు చేరింది. క్షణాల్లోనే జరిగిన ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
కుమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశ్, లావణ్య దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె శాన్వి ఉన్నారు. కుమార్తె శాన్వికి ఐదేళ్లు ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. కాగా.. నిన్న ఆదివారం కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోన్న క్రమంలో ఇంటి ఆవరణలోని ఓ బాటిల్లో ఉన్న పురుగుల మందును కూల్‌డ్రింక్ అనుకుని తాగేసింది. దీంతో.. అనంతరం ఇంటిలోకి వచ్చిన చిన్నారి శాన్వి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఓ ఆసుపత్రిలో చూపించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి, ఇంతలోనే అనంతలోకాలకు చేరడంతో వారి రోదనలు మిన్నంటాయి. చిన్నారి శాన్వి మృతితో భీంపూర్ గ్రామంలో.. విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!