Ramakrishna Math: బుక్ లవర్స్కు శుభవార్త.. పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna Math: ఆన్లైన్లో పుస్తకాలు అందుబాటులోకి వచ్చినా మనకు నచ్చిన పుస్తకం కొనుగోలు చేసి చదువుతుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే ఇప్పటికీ చాలా మంది రైళ్లు లేదా బస్సుల్లో పుస్తకాలు చదువుతూ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో పుస్తకాల ప్రియులకు హైదరాబాద్లోని రామకృష్ణ మఠం బంపర్ ఆఫర్ ఇచ్చింది. దివ్యజనని శ్రీ శారదాదేవి 170వ జయంతి సందర్భంగా డిసెంబర్ 15న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాల కొనుగోలుపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. స్వామి వివేకానంద సాహిత్యంతో పాటు అనేక పుస్తకాలపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.
Read Also: Pavitra Lokesh: పవిత్ర- నరేష్ కేసులో కొత్త ట్విస్ట్.. వారికి దబిడిదిబిడే
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
అటు శారదాదేవి 170వ జయంతి సందర్భంగా ఈనెల 15వ తేదీ ఉదయం 5:30 గంటలకు సుప్రభాతం, మంగళ హారతి, భజనలు ఉంటాయని రామకృష్ణ మఠం ప్రతినిధులు వెల్లడించారు. ఉదయం 6:30 గంటలకు దేవాలయ ప్రదక్షిణం ఉంటుందని.. ఉ.7 గంటలకు విశేష పూజ, లలితా సహస్రనామ పారాయణం, భజనలు ఉంటాయని తెలిపింది. ఉదయం 10:30 గంటలకు హోమం నిర్వహించనున్నట్లు వివరించింది. ఉ.11:30 గంటలకు దివ్యజనని శ్రీ శారదాదేవి జీవితం, సందేశంపై ప్రసంగం ఉంటుందని పేర్కొంది. మధ్యాహ్నం 12:15 గంటలకు విశేష హారతి, మధ్యాహ్నం 12:30 గంటలకు భోజన ప్రసాదం ఉంటాయని చెప్పింది. మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయం దిగువ హాలులో శారదాదేవి చలనచిత్ర ప్రదర్శన, సాయంత్రం 6:45 గంటలకు ఆరాత్రికం, రాత్రి 7:15 గంటలకు ప్రత్యేక భజనలు ఉంటాయని.. భక్తులు ఈ మేరకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు.
శ్రీ శారదా దేవి 170వ జయంతి సందర్భంగా డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం రాయితీ ఇస్తామని మఠం ప్రతినిధులు తెలిపారు.
— AIR News Hyderabad (@airnews_hyd) December 12, 2022
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!