Ramakrishna Math: ఆన్‌లైన్‌లో పుస్తకాలు అందుబాటులోకి వచ్చినా మనకు నచ్చిన పుస్తకం కొనుగోలు చేసి చదువుతుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే ఇప్పటికీ చాలా మంది రైళ్లు లేదా బస్సుల్లో పుస్తకాలు చదువుతూ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో పుస్తకాల ప్రియులకు హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం బంపర్ ఆఫర్ ఇచ్చింది. దివ్యజనని శ్రీ శారదాదేవి 170వ జయంతి సందర్భంగా డిసెంబర్ 15న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాల కొనుగోలుపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. స్వామి వివేకానంద…