కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మరోసారి నామినేషన్ దాఖలు చేసారు. ఆ గెల్లు శ్రీనివాస్ వెంట నామినేషన్ కేంద్రానికి మంత్రి హరీష్ రావు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బలు మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయగా అతని వెంట నామినేషన్ కు కేంద్రానికి వచ్చారు కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్,దామోదర రాజా నర్సింహా. ఇక ఈటల జమున నామినేషన్ దాఖలు చేయగా… నామినేషన్ వేశారు ఈటల రాజేందర్. ఆ సమయంలో రాజేందర్ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు.