సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకోనున్న సీఎం. 11.15 – 12.50 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న అభివృద్ధి పనులు ఇలా..
తెలుగు బూతులపార్టీ, జనసేనను రౌడీ సేనగా మార్చేశారు. కుప్పంలో కూడా చంద్రబాబు ఏం చేయలేదు. ఎంపీటీసీ, జెడ్సీటీసీ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించారు. ఇదేం ఖర్మరా బాబు అని ప్రజలు అనుకోబట్టే.. 2019 లో ఎన్నికల్లో ఓడించి బై బై చెప్పారు. ఇంటింటి అభివృద్ధికి ఓటు వేసి దీవించారు. చంద్రబాబుని కూడా ఎన్టీఆర్ బాధపడేవారు. ఇదేం ఖర్మరా బాబు అనుకుని వుంటారు ఎన్టీఆర్. మన రాజకీయాల్లో వుండడం ఇదేం ఖర్మరా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సరేసరి.. లేదంటే చివరి ఎన్నికలంటూ బాబు బెదిరిస్తున్నాడు. తాను కుప్పంలో కూడా గెలవలేనన్న భయం, నిరాశ, నిస్పృహ కనిపిస్తోంది. మాటల్లో చేష్టల్లో కనిపిస్తోంది.చంద్ర బాబు ప్రవర్తన చూస్తుంటే రాష్ట్ర ప్రజలను బెదిరించే విధంగా వుంది. ఇలాంటి మనుషుల్ని చూస్తే... అధికార భగ్న ప్రేమికుడు బెదిరిస్తున్నాడు. ఏమంచి చేయని తనకు ఎవరు ఓటేస్తారు.. ఎందుకు ఓటేయాలని చెప్పరు. వీళ్ళకి చెప్పేదానికి ఏం లేదు. ప్రజల గుండెల్లో స్థానం వుండదు. కేవలం వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా కోసం పనిచేస్తారు. దోచుకో పంచుకో తినుకో అని ఒప్పందం చేసుకుంటారు. ప్రతి కుటుంబంలో మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా తీసుకోండి.. మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి.
ముమ్మిడివరం ONGC కార్యకలాపాలు వల్ల నష్టపోయిన మత్సుకారుల 108కోట్లు బటన్ నొక్కి అందించ బోతున్నాం. నర్సాపురం లో 1921లో బ్రిటిష్ ప్రభుత్వం అగ్రికల్చర్ కంపెనీ కి లీజుకు ఇచ్చిన భూములను 1623 మంది రైతులకు అందించ బోతున్నాం..కొల్లేరు 5వ కాంటూరు వరకు నీరు నిల్వ ఉండేలా 108కోట్లతో రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టబోతున్నాం.. 13వందల కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేశాం.. నరసాపురంలో బస్టాండ్ ఆధునీకరణ పూర్తి చేశాం..పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా వాసులకు నీటి ఎద్దడి తీరనుంది. నర్సాపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాం అన్నారు జగన్.
9 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం.ఇవాళ మత్స్య కారుల బాగుకి కట్టుబడిన ప్రభుత్వంగా నర్సాపురం బియ్యపు తిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయబోతున్నాం..రాష్ట్రంలో మత్య కారులు తల ఎత్తుకుని బతికెలా 3,500 కోట్లతో రాష్ట్రంలో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ లు ఏర్పాటు చేస్తున్నాం..ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు.ఈ ప్రభుత్వం మీది. మీకు తోడుగా ఉంటాం. ప్రతి ఎస్సీ, బీసీ, మైనారిటీలు జగనన్న ప్రభుత్వం అంటే మాది, మన ప్రభుత్వం అని అడుగు పడుతూ వుంది. నరసాపురానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. రైతులకు పట్టాలిస్తాం. రైతుల పేరు మీద దస్తావేజులు అందిస్తాం. ఎకరాకు 100 రూ.లు చెల్లిస్తే చాలు. 1600 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
కార్తీకమాసం చివరి సోమవారం నాడు 3300 కోట్లు ఖర్చయ్యే 15 కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. ఇది నరసాపురం చరిత్రలో జరిగిన దాఖలాలు లేవు. నరసాపురం రూపురేఖలు మారుస్తాం. ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ ప్రధానమయింది. మెరైన్ ఎక్స్ పోర్ట్స్, ప్రోడక్స్ లో దేశంలో మనమే నెంబర్ వన్.దేశంలో ఎక్కడ అవసరం వున్నా యూనివర్శిటీ రాబోతోంది. ఆక్వా కల్చర్ దశ మారనుంది. మానవ వనరుల కొరత తీర్చడానికి పనిచేస్తున్నాం. ఫిషరీస్ యూనివర్శిటీ రాబోతోంది.టెండర్లు పిలిచాం. పనులు ప్రారంభం కాబోతున్నాయి. మత్స్యకారుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ కోసం 430 కోట్లు ఖర్చుచేయబోతున్నాం. ఇవాళ రాష్ట్రంలో రూపురేఖలు మారుతున్నాయి.
ఏ నాయకుడు మత్స్యకారుడిని ఎవరూ ఆదుకోలేదు. నేను వున్నాను.. నేను విన్నానని జగన్ భరోసా ఇచ్చారన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఏ మత్స్యకారుడు వలసలు వెళ్ళకూడదు. హార్బర్ల ద్వారా కొత్త జీవితాలు ఇస్తున్నారు. నెల్లూరు, కృష్ణాజిల్లా, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్లో హార్బర్లు వస్తున్నాయి. బియ్యపుదిబ్బ దగ్గర హార్బర్ కుదరదని కేంద్రం తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ హార్బర్ కోసం పనిచేస్తోంది. ఆక్వారంగంలో ఒడిదుడుకులు వున్నాయన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఆక్వా ఎగుమతుల్లో ఇబ్బందుల వల్ల జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. జగన్ నిర్ణయాల వల్ల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయం అన్నారు.
పశ్చిమగోదావరి దశను మార్చేలా కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేయానికి సీఎం రావడం సంతోషంగా వుంది. వందల ఏళ్ళ క్రితం బ్రిటిష్ వారు నరసాపురంని వ్యాపారం కోసం వాడుకున్నారు. నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూశాం.. ఎన్నికల హామీగానే అది మిగిలిపోయింది. నరసాపురంని అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు జగన్. రూపురేఖలు మార్చి విమర్శకులకు సమాధానం ఇస్తాం. వనరులు అన్నీ ఉన్నా కలుషిత నీటిని తాగుతున్నాం.. అప్పటి సీఎం వైఎస్సార్ కి తాగునీటి గురించి అడిగాం. అప్పుడు బీజం పడింది.. ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. మత్స్యకారులను గుర్తించి వారికి మేలు చేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ సమస్యలు తీర్చేందుకు సీఎం శంకుస్థపన చేశారు. తీరప్రాంతంలో ఆక్వా వర్సిటీ, తాగునీటి ప్రాజెక్ట్, వుప్పుటేరు రెగ్యులేటర్ నిర్మాణం, వశిష్ట వారదితో పాటు అనేక అభివృద్ది పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ఏడాదిన్నర లో పనులు పూర్తి చేస్తాం..మరికొన్ని అభ్యర్థనలు పరిశీలించి, నిధులు మంజురుచేయాలని కోరుతున్నాను.
నరసాపురం సభా ప్రాంగణం నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సీఎం జగన్. రూ400కోట్లతో వాటర్ గ్రిడ్ పధకానికి, 430 కోట్లతో హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్వా యూనివర్శిటీ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన కావించారు.
సీఎం వైఎస్ జగన్ నరసాపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అమరావతి:తాడేపల్లి నివాసం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్
భీమవరంలో బిజెపి నాయకులు అక్రమ హౌస్ అరెస్టు ల పై ఆందోళనకు దిగారు. సీఎం జగన్ నర్సాపురం పర్యటన కు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ప్రదర్శనలకు బిజెపి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న సమస్యలు నెరవేర్చిన తరువాతే జిల్లాలో జగన్ పర్యటించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బిజెపి కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.
సీఎం జగన్ పర్యటనకు అంతా సిద్ధం అయింది. నరసాపురంలో సీఎం జగన్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 2వేల మంది పోలీసులతో పూర్తి బందోబస్తు ఏర్పాటుచేశారు.