సీఎం అంటే జగనే.. ఏపీ సీఎంపై కోమటిరెడ్డి ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగనే అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి రూపాయలు దాటిన వైద్యం అంతా ఆరోగ్య శ్రీలోనే అన్న ఆయన.. కరోనా ట్రీట్ మెంట్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారంటూ ప్రశంసించారు.. అయితే, కరోనా వైరస్ బారినపడి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు తగలేస్తున్నారని.. మరి తెలంగాణలో కరోనా ట్రీట్‌మెంట్‌ను ఎందుకు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవడం లేదంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు కోమటిరెడ్డి.. ఓటు వేసే ముందు… నీ కొడుక్కి ఉద్యోగం వచ్చిందా..? మీకు ఇళ్లు వచ్చాయా? లేదా? అనేది ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఉన్నట్టుండి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కోమటిరెడ్డి ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
-
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!