Xiaomi 17T Series: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ (Xiaomi) త్వరలో గ్లోబల్ మార్కెట్లలో కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధం అవుతోందని సమాచారం. ఈ లాంచ్‌లలో భాగంగా Xiaomi 17T సిరీస్ ను పరిచయం చేసే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సిరీస్‌లో Xiaomi 17T, Xiaomi 17T Pro మోడళ్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వనిల్లా మోడల్ అయిన Xiaomi 17T, గత తరం Xiaomi 15Tతో పోలిస్తే భారీ బ్యాటరీతో రానుంది. అంతేకాదు, ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం తెలుస్తోంది.
Read Also: IND vs NZ: నేడే భారత్ వర్సెస్ కివీస్ చివరి టీ20.. సొంతగడ్డపై సంజు శాంసన్‌కు ఛాన్స్?
Xiaomi 17T కీలక స్పెసిఫికేషన్లు:
HyperOS కోడ్ మార్పుల ద్వారా Xiaomi 17T ప్రధాన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. P12A అనే ఇంటర్నల్ కోడ్ నేమ్‌తో గుర్తించబడిన ఈ ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ, ఛార్జింగ్, కెమెరా వివరాలు వెలుగులోకి వచ్చాయి. Xiaomi 17Tలో 6,500mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది నిజమైతే, Xiaomi 15Tలో ఉన్న 5,500mAh బ్యాటరీతో పోలిస్తే బిగ్ అప్‌గ్రేడ్ అవుతుంది. అయితే, ఛార్జింగ్ విషయంలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని సమాచారం. ఈ ఫోన్ 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుందని తెలుస్తోంది.
Read Also: Tragic Incident in Jangareddygudem: గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి..
కెమెరా సెటప్‌లో మార్పుల్లేవు?:
* Xiaomi 17Tలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
* OmniVision OV50E సెన్సర్ (ప్రైమరీ కెమెరా)
* OmniVision OV13B సెన్సర్ (అల్ట్రా వైడ్ కెమెరా)
* Samsung ISOCELL JN5 సెన్సర్ (టెలిఫోటో కెమెరా)
* Samsung ISOCELL S5KKDS సెన్సర్ ను సెల్ఫీ కెమెరా..
* Xiaomi 15Tలో 50MP Light Fusion 800 ప్రైమరీ కెమెరా,
* 50MP టెలిఫోటో కెమెరా
* 12MP అల్ట్రా వైడ్ కెమెరా
* సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా
శక్తివంతమైన ప్రాసెసర్‌తో Xiaomi 17T?
* Xiaomi 17Tకు MediaTek Dimensity 9500s చిప్‌సెట్
* Generative AI
* Agentic AI
* MediaTek NPU ఈ చిప్‌సెట్‌ను తైవాన్‌కు చెందిన మీడియాటెక్ సంస్థ ఈ నెల ప్రారంభంలోనే విడుదల చేసింది. ఇదే ప్రాసెసర్‌ను Redmi Turbo 5 Maxలో కూడా ఉపయోగించినట్లు తెలుస్తుంది.
Xiaomi 17T Pro లాంచ్ టైమ్‌లైన్:
ఇదిలా ఉండగా, Xiaomi 17T Pro మోడల్ అక్టోబర్ 2025లో IMEI డేటాబేస్‌లో కనిపించిన విషయం తెలిసిందే. దీని మోడల్ నంబర్లు 2602EPTC0G, 2602EPTC0Rగా నమోదు అయింది. ఇవి ఫిబ్రవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది సాధారణంగా సెప్టెంబర్‌లో జరిగే Xiaomi T-సిరీస్ విడుదల షెడ్యూల్‌తో పోలిస్తే ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు.