ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది… వాట్సాప్ రంగ ప్రవేశం చేసినప్పట్టి నుంచి ఎన్నో అప్‌డేట్లు.. మరో కొత్త కొత్త ఫీచర్లతో.. యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తూ వస్తుంది.. ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది.. వారి ఇబ్బందులను గుర్తించి.. వారి అభిరుచులకు అనుగుణంగా ఫీచర్స్ తీసుకొస్తున్న వాట్సాప్ ఇప్పుడు.. ఒకే నంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్ ఫోన్లతో పాటు మరో రెండు డివైస్‌లలో యాక్సిస్ కలిపించనుంది.. దీనికి సంబంధించిన సేవను ఎనేబుల్ చేసేలా కంపానియన్ మోడ్ అనే ఫీచర్‌ని పరీక్షిస్తోంది వాట్సాప్.. ఇక, ఫీచర్లను ట్రాక్ చేసే వాబేటా ఇన్ఫో ప్రకారం కంపానియన్ మోడ్ ఫీచర్ కొన్ని బీటా టెస్టర్లకు విడుదల
చేసింది వాట్సాప్.
Read Also: Students Fighting: విద్యార్థుల మధ్య ఘర్షణ.. కాలేజ్‌లోనే కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు
అయితే, కొంత మంది బీటా టెస్టర్లకోసం ఫీచర్‌ని వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తుంది.. అంతేకాదు.. మొబైల్, డెస్క్ టాప్‌లో ఏకకాలంలో వాట్సాప్‌ను ఉపయోగించేలా ఈ కొత్త ఫీచర్ పనిచేస్తోంది.. లింక్ డివైస్ ఆప్షన్ ద్వా రా రెండో స్మార్ట్ ఫోన్‌కు కూడా లింక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.. అంతేకాదు.. మరో స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసిన తర్వా త, చాట్ హిస్టరీ చూడటం తోపాటు, మెసేజేస్ చూసుకోవడం, సమాధానాలివ‍్వ డం.. కాల్స్ చేసుకోవడం కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. బీటా టెస్టర్ గరిష్టంగా 4 పరికరాలను రెండు స్మార్ట్ ఫోన్లను ఒక టాబ్లెట్, ఒక డెస్క్ టాప్‌కి లింక్ చేసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు.. అయితే, ఈ ఫీచర్ ఎంపిక చేయబడిన వినియోగదారుల సమూహం కోసం మాత్రమే ప్రారంభించబడింది.. ఇతర బీటా వినియోగదారులు ఎప్పుడు ఈ జాబితాకు జోడించబడతారో లేదో తెలియాల్సి ఉంది..