WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త అప్‌డేట్.. ఒకేసారి ఎక్కువమందితో చాటింగ్ చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Update in Whatsapp: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ అడ్మిన్‌లకు శుభవార్త అందింది. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్‌లో 512 మందిని మాత్రమే యాడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉండేది. అయితే ఇప్పుడు గ్రూప్‌లో ఉండే సభ్యుల సంఖ్యను వాట్సాప్ పెంచింది. కొత్త అప్‌డేట్ ప్రకారం ఒక గ్రూప్‌లో 1024 మందిని యాడ్ చేసుకోవచ్చు. అంటే గతంలో ఉండే సంఖ్యను వాట్సాప్ రెట్టింపు చేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ బీటా వెర్షన్‌లో ఇప్పటికే ఈ అప్‌డేట్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వాట్సాప్ వెల్లడించింది.
Read Also: T20 World Cup: అదరగొట్టిన బౌలర్లు.. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియాదే విజయం
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
కాగా త్వరలో యూజర్లందరికీ ఈ అప్‌డేట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు గ్రూప్ అడ్మిన్‌ల కోసం వాట్సాప్ కొత్త అప్రూవల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త ఫీచర్‌తో గ్రూప్‌లో చేరేందుకు అడ్మిన్ రిక్వెస్ట్ పంపిన వ్యక్తుల జాబితా పెండింగ్ పార్టిసిపెంట్స్‌గా కనిపిస్తుంది. వారిలో ఎవరినైతే గ్రూప్‌లో సభ్యులుగా చేర్చుకోవాలని భావిస్తే వారిని అనుమతిస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌తో ఎక్కువ మంది సభ్యులున్న గ్రూప్ నిర్వహణ సులభతరం అవుతుందని వాట్సాప్ భావిస్తోంది. గ్రూప్ సభ్యుల సంఖ్య పెరగడంతో ఎక్కువ మందితో చాటింగ్ చేసుకోవచ్చు. విలువైన సమాచారాన్ని కూడా షేర్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కాగా త్వరలో యూజర్ ప్రైవసీ కోసం వ్యూవన్స్‌లో స్క్రీన్ షాట్ బ్లాక్ అనే మరో ముఖ్యమైన ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకురానుంది. అటు పోల్, అవతార్, ఎడిట్, వాయిస్ స్టేటస్ వంటి ఫీచర్లు కూడా వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అవతార్ ఫీచర్ కింద వినియోగదారులు తమ అవతార్‌ను సృష్టించుకోవచ్చు. స్నేహితులకు స్టిక్కర్లను పంపడమే కాకుండా ప్రొఫైల్ ఫోటోపై వారి అవతార్‌ను కూడా ఉంచవచ్చు.
WhatsApp is releasing larger groups up to 1024 participants!
Some lucky beta testers on WhatsApp beta for Android and iOS can add up to 1024 participants to their groups!https://t.co/qDbG3AWaIu pic.twitter.com/oI8Dtg30RK
— WABetaInfo (@WABetaInfo) October 8, 2022
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!