ప్రముఖ సోషల్ మీడియా ఇంస్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. గత కొన్ని రోజులుగా వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. అందుభాగంగా వాట్సప్ ఛానెల్స్, సింగిల్ డివైజ్‌లో మల్టీపుల్ వాట్సప్ అకౌంట్లను వినియోగించే మల్టీ- అకౌంట్ ఫీచర్ ను తీసుకొని వచ్చింది.. తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది..
తాజాగా..వ్యూ వన్స్..తరహాలో వాయిస్ నోట్స్‌పై మరో అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. వీ బీటా అందిస్తున్న సమాచారం ప్రకారం.. యూజర్ల భద్రత కోసం వాయిస్ నోట్స్ అనే ఫీచర్‌పై వాట్సప్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే వాయిస్ రికార్డ్‌లు ఫోన్‌లో స్టోర్ అవ్వకుండా చేస్తుంది.. అవి మళ్లీ సేవ్ చేసుకొనేవరకు అవి అలానే ఉంటాయి.. వాట్సప్ యూజర్ మరో యూజర్ కు వాయిస్ మెసేజ్ చేస్తాడు.. సాధారణంగా అలాంటి వాయిస్ ఫైల్స్ ఫోన్‌లలో స్టోరేజ్ అవడంతో పాటు అనేక భద్రతా సమస్యలు తలెత్తేవి.
అయితే, ఈ సమస్యను అధిగమించేలా వాయిస్ నోట్స్ పేరుతో వాయిస్ మెసేజ్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో వాట్సప్‌లో పంపిన, లేదంటే రిసీవ్ చేసుకున్న ఆడియో ఫైల్స్‌ని ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు ఆ తర్వాత అవి కనిపించవు.. మీకు వాట్సప్ ‘వ్యూ వన్స్’ ఫీచర్ గురించి తెలిసిందే. దీని కింద ఎవరైనా పంపిన ఫొటోలు, వీడియోలను ఒకసారి మనం ఓపెన్ చేస్తే వాటంతటవే అదృశ్యమైపోతాయి.. అలాగే ఇప్పుడు వాయిస్ మెసేజ్ లకు కూడా వర్తిస్తుంది. ఒకసారి ఫైల్ ను ఓపెన్ చేస్తే తర్వాత కనిపించవు.. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది..