ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కస్టమర్లకు ఎప్పుడూ గుడ్ న్యూస్ లను చెబుతుంది.. సెక్యూరిటీ పరంగానే కాకుండా ప్రత్యేకమైన ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇకపోతే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.. ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ లను వాడుకొనే వెసులుబాటును వాట్సాప్ అందిస్తుంది.. మొదట లాగిన్‌లో ఉన్న అకౌంట్ నుంచి లాగవుట్ అయిన తర్వాతే.. మరో అకౌంట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.. ఇమెయిల్ లాగానే.. అంటే ఒక అకౌంట్ ను లాగిన్ చేస్తే మరో అకౌంట్ ను లాగౌట్ చెయ్యాలి..
వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఒకే ఫోన్‌లో రెండు ఫోన్ నెంబర్లతో రెండు వాట్సాప్ ఖాతాలు ఉపయోగించుకోవచ్చని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.. త్వరలోనే ఈ ఫీచర్ ను పరిచయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.. ఒకప్పుడు వేరే యాప్ ద్వారా వాట్సాప్ మరో అకౌంట్ ను ఓపెన్ చెయ్యాల్సి ఉంటుంది.. ప్రస్తుతం చాలా మంది యూజర్లు రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఒక అకౌంట్, వర్క్ కోసం మరో అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారి కోసమే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు…
ఈ కొత్త ఫీచర్ ను ఎనెబుల్ చేసుకోవాలంటే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. అనంతరం రైట్ సైడ్‌లో మూడు డాట్‌లను క్లిక్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని. యాడ్ అకౌంట్‌ను క్లిక్ చేయాలి. దీంతో రెండో అకౌంట్ యాడ్ అవుతుంది.. అవసరం లేకుంటే ఈ ఖాతాలను స్విచ్ ఆఫ్ చెయ్యొచ్చు.. ఈ ఫీచర్ వల్ల చాలా మందికి మంచే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..