WhatsApp Bans Over 22 Lakhs Indian Accounts
ప్రముఖ మెసేజింగ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ జూన్ నెలలో 22 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. వాట్సాప్‌ను దుర్వినయోగం చేస్తూ.. పలువురికి ఇబ్బంది కలగించినట్లు వాట్సాప్‌కు ఫిర్యాదులు రావడంతో ఈ ఖాతాలను తొలగించినట్లు వాట్సాప్ పేర్కొంది. అంతేకాకుండా.. ఇలా.. మే నెలలో వాట్సాప్ నిషేధించిన 19 లక్షలు, ఏప్రిల్‌లో 16 లక్షల ఖాతాలు, మార్చిలో 18.05 లక్షల ఖాతాల కంటే ఇది ఎక్కువ. గత సంవత్సరం అమల్లోకి వచ్చిన కొత్త, పటిష్టమైన ఐటీ నియమాలు ప్రకారం.. 50 లక్షలకు పైగా వినియోగదారులతో ఉన్న పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి నెలా నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. అందిన ఫిర్యాదుల వివరాలను, తీసుకున్న చర్యలను పేర్కొనాల్సి ఉంటుంది. అయితే.. పెద్ద సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం మరియు నకిలీ వార్తలపై గతంలో విరుచుకుపడ్డాయి. కొన్ని సమయాల్లో, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్‌ను తగ్గించడంలో మరియు వినియోగదారులను ‘డి-ప్లాట్‌ఫార్మింగ్’ చేయడంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని కూడా ఆందోళనలు వెలుగులోకి వచ్చాయి. “తాజా నెలవారీ నివేదికలో క్యాప్చర్ చేయబడినట్లుగా, జూన్ నెలలో వాట్సాప్ 2.2 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించింది” అని వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. కస్టమర్-సెక్యూరిటీ నివేదికలో స్వీకరించబడిన వినియోగదారు ఫిర్యాదుల వివరాలు, వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి దాని స్వంత నివారణ చర్యలు ఉన్నాయని ప్రతినిధి తెలిపారు. +91 ఫోన్ నంబర్ ప్రిఫిక్స్ ద్వారా భారతీయ ఖాతా గుర్తించబడుతుంది.
నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూన్ 30 మధ్య 22.10 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. “దుర్వినియోగాన్ని గుర్తించే విధానాన్ని ఉపయోగిస్తుంది, ఇందులో వినియోగదారుల నుండి వచ్చిన ప్రతికూల ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించి తీసుకున్న చర్యలు కూడా ఉన్నాయి.. సంవత్సరాలుగా, మేము మా ప్లాట్‌ఫారమ్‌లో మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి అర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ మరియు ఇతర… సాంకేతికత, డేటా శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రక్రియలలో చర్యలు తీసుకున్నాము” అని ప్రతినిధి పేర్కొన్నారు. జూన్ 2022లో 632 ఫిర్యాదుల నివేదికలు స్వీకరించబడ్డాయి మరియు 64 ఖాతాలపై చర్యలు తీసుకోబడ్డాయి. అందుకున్న మొత్తం నివేదికలలో, 426 ‘బ్యాన్ అప్పీల్’కి సంబంధించినవి అయితే మరికొన్ని ఖాతాలకు సంబంధించిన భద్రత వంటి విభాగాల్లో ఉన్నాయి. “ఒక ఫిర్యాదు మునుపటి టిక్కెట్‌కి డూప్లికేట్‌గా భావించబడిన సందర్భాల్లో మినహా అందిన అన్ని ఫిర్యాదులకు మేము ప్రతిస్పందిస్తాము. ఫిర్యాదు ఫలితంగా ఖాతా నిషేధించబడినప్పుడు లేదా గతంలో నిషేధించబడిన ఖాతా పునరుద్ధరించబడినప్పుడు ఖాతా ‘చర్యలు తీసుకోబడుతాయి’ ” అని నివేదిక పేర్కొంది.