స్క్వేర్ సెన్సార్ సెల్ఫీ కెమెరా.. యాపిల్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న Oppo Find X10, హువావే
- యాపిల్ టెక్నాలజీని అనుసరిస్తున్న ఒప్పో, హువావే..
- స్క్వేర్ సెన్సార్ సెల్ఫీ కెమెరా రాబోతున్న ఒప్పో, హువావే క్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo Find X10: ఆపిల్ తన వార్షిక లాంచ్ ఈవెంట్‌లో సెప్టెంబర్ 2025లో ఐఫోన్ 17 సిరీస్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో అనేక అప్‌గ్రేడ్స్ ఉన్నప్పటికీ, ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఫీచర్ కొత్త సెల్ఫీ కెమెరా.. ఈ కెమెరా సంప్రదాయ డిజైన్‌కు భిన్నంగా స్క్వేర్ (1:1) సెన్సార్ ను ఉపయోగించింది. ఇప్పుడు ఇదే టెక్నాలజీని ఒప్పో (Oppo), హువావే (Huawei) కూడా తమ రాబోయే స్మార్ట్‌ఫోన్లలో అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Read Also: Deepika Padukone: తల్లిగా బాధ్యతలు.. నటిగా కొత్త పాఠాలు.. దీపికా పదుకొణె ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ!
Also Read
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
ఐఫోన్ 17లోని సెల్ఫీ కెమెరా ప్రత్యేకతలు:
ఐఫోన్ 17 సిరీస్‌లో కొత్తగా 18 మెగాపిక్సెల్ ‘సెంటర్ స్టేజ్’ సెల్ఫీ కెమెరాను యాపిల్ అందించింది. ఇది సాధారణ ఫ్రంట్ కెమెరాల్లా కాకుండా స్క్వేర్ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. ఫోటో తీసేటప్పుడు వ్యక్తి లేదా గ్రూప్ ఎప్పుడూ ఫ్రేమ్ మధ్యలో ఉండేలా ఆటో జూమ్ చేస్తుంది. అవసరమైనప్పుడు ఆటో రొటేషన్ ద్వారా ఫ్రేమ్‌ను సర్దుతుంది. ఫోన్‌ను నిలువుగా పట్టుకుని కూడా ల్యాండ్‌స్కేప్ సెల్ఫీలు తీసుకునే ఛాన్స్ ఉంది. సెన్సార్‌ను క్రాప్ చేసి జూమ్ అవుట్ చేయడం ద్వారా ఫోటోను స్వయంచాలకంగా సర్దుబాటు చేయగలగడం దీని ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Oppo Find X10 సిరీస్‌లో కొత్త టెక్నాలజీ?:
చైనాకు చెందిన ఒప్పో కూడా 1:1 స్క్వేర్ సెన్సార్ పై పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ టెక్నాలజీని ఒప్పో తన రాబోయే ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన Oppo Find X10లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న Find X9 Ultra మోడల్ మాత్రం ఇతర Find X9 సిరీస్ ఫోన్లలో ఉన్న కెమెరా టెక్నాలజీకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఒప్పో అమలు చేసే స్క్వేర్ సెన్సార్ టెక్నాలజీ ఆపిల్ కంటే కూడా మెరుగ్గా ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: Dacoit : ధురంధర్ 2′ ఎఫెక్ట్.. అడివి శేష్ ‘డెకాయిట్’ ఏప్రిల్‌కు పోస్ట్‌పోన్
ఒప్పోతో పాటు హువావే:
ఒప్పోతో పాటు హువావే కూడా 1:1 స్క్వేర్ సెన్సార్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. అయితే, హువావే ఈ ఫీచర్‌ను తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కాకుండా, ఫోటోగ్రఫీకి ప్రాధాన్యం ఇచ్చే మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో అందించే ఛాన్స్ ఉంది. ఈ టెక్నాలజీ Huawei Nova 16 సిరీస్ లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!